స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగీ (106) 2022 నవంబర్ 5న మరణించారు. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నెర్కు చెందిన నేగీ 1917 జులై 1న జన్మించారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. 2022 నవంబర్ 2న నేగీ 34వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆయన ఓటేశారు.
Good information
ReplyDelete