పదో తరగతి తర్వాత చాలామంది పై చదువులకు వెళ్తుంటారు. కానీ.. ఆర్థిక పరంగా కొంత మంది విద్యార్థులు ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఇలా పదో తరగతి తర్వాత ఉద్యోగం సంపాదించాలంటే ఐటీఐ బెస్ట్ కోర్సుగా చెప్పుకోవచ్చు. పదో తరగతి తర్వాత చాలామంది పై చదువులకు వెళ్తుంటారు. కానీ.. ఆర్థిక పరంగా కొంత మంది విద్యార్థులు ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఇలా పదో తరగతి తర్వాత ఉద్యోగం సంపాదించాలంటే ఐటీఐ బెస్ట్ కోర్సుగా చెప్పుకోవచ్చు. దేశ వ్యాప్తంగా కూడా అనేక రకాలు ఐటీఐలు ఉన్నాయి. ఇవి విద్యార్థులకు వృత్తిపరమైన, సాంకేతిక శిక్షణను అందించి వారికి ఉపాధిని కల్పిస్తాయి. ఐటీఐ చేస్తున్న విద్యార్థులు తర్వాత పాలిటెక్నిక్ కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఐటీఐ చేసిన విద్యార్థులకు ప్రభుత్వం శాఖల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్టరీలు ఉన్న ప్రతిచోటా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఐటీఐ చదివిన యువతకు ఉపాధి ఉంటుంది. తెలంగాణలో ఐటీఐలో ప్రవేశాల కొరకు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించరు. కేవలం పదో తరగతిలో వచ్చిన స్కోర్స్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఒక వేళ 8వ తరగతితోనే అభ్యర్థులు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే.. ఈ అర్హతతో ఐటీఐ పూర్తి చేయవచ్చు. ఐటీఐ నుంచి శిక్షణ తీసుకుంటున్న యువత రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పీడబ్ల్యూడీ, ఇరిగేషన్, వృత్తి విద్య, సాంకేతిక విద్యా శాఖ తదితర విభాగాల్లో ఉపాధి పొందుతున్నారు. BHEL, UPPCL, HAL, SAIL, NTPC, ONGC వంటి సంస్థలలో దాదాపు ప్రతి సంవత్సరం ఖాళీలు ఉంటాయి. వీటితో పాటు.. ప్రైవేట్ సెక్టార్ లో కూడా.. అపార అవకాశాలు ఉన్నాయి. టాటా మోటార్స్, మారుతీ సుజుకి, హ్యుందాయ్, ఎస్కార్ట్స్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, హోండా, ఎస్సార్, ITC, Mahindra, Jindal, Wipro, Infosys, Videocon మొదలైనవి ITI విద్యార్థులను పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంటాయి. ఐటీఐ చదువుతున్న యువత సొంతంగా ఉపాధి కల్పించుకోవడానికి ముద్ర రుణ పథకం కింద ప్రభుత్వం పూచీకత్తు లేకుండా రుణాలు అందజేస్తుంది.

Age limit for the above post
ReplyDelete