TGSRTC Jobs: టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఓ కీలక విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిరుద్యోగులు ఆనందపడే ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)లో కొలువుల జాతర షురూ కాబోతోంది. రీసెంట్ గా మహాలక్ష్మి స్కీం తీసుకొచ్చి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే TGSRTCలో 3035 ఉద్యోగాల భర్తీకి స్వీకారం చుట్టారు. ఈ ఖాళీల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో విషయం బయటకొచ్చింది.
టీజీఎస్ఆర్టీసీలో వచ్చే ఐదేళ్లలో భారీగా ఉద్యోగాల కల్పన ఉండనుందని తెలుస్తోంది. డిపార్ట్మెంట్లో ఏకంగా 10 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని సమాచారం. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచడంతో 2020, 2021 సంవత్సరాల్లో చాలా వరకు రిటైర్మెంట్స్ ఆగిపోయాయి. వీరంతా కూడా 2022 నుంచి రిటైర్మెంట్లు షురూ కానున్నాయి. ఈ ఏడాది 2196, 2025లో 1859, 2026లో 2001, 2027లో 1900 మంది రిటైర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే 10 వేల మందికి పైగా రిటైర్మెంట్లు కానున్నాయి. దీంతో ఈ వెకెన్సీస్ భర్తీపై RTC ఫోకస్ పెట్టాల్సి వస్తుంది.
ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారు. అయితే కారుణ్య నియామకాలు మినహా గత పదేళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు జరగలేదని, సీఎం రేవంత్రెడ్డి చొరవతో ఇప్పుడు భారీ ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని గతంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకు మార్గం సుగమమం చేస్తూ TGSRTC లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు 10 వేల పోస్టులపై సమాచారం రావడంతో నిరుద్యోగులు ఖుషీ ఖుషీ అవుతున్నారు.
ఏప్పుడు రిలీజ్ చేస్తారు ఇంతకు ముందు చెప్పినవి
ReplyDeleteనాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది ఆర్టీసీలో ఉద్యోగం కొట్టాలని
ReplyDeleteNo interest
ReplyDeleteI want interest
ReplyDeleteIvanni nijamenaa
ReplyDelete9581213733
ReplyDeleteReally true na
ReplyDeleteMa sir ki kuda job kavali frnds
ReplyDeleteAJAYSINGH
ReplyDeleteI want intrest
ReplyDelete