బహదూర్ షా తదనంతరం జరిగిన వారసత్వ ఘర్షణలతో పాలుపంచుకున్న అతడి కుమారులు జహాందర్ షా, అజీమ్ - ఉస్ -షాన్, రఫీ-ఉస్-షాన్, జహాన్ షా. జహందర్ షా జుల్ఫీకర్ ఖాన్ సహాయంతో మొగలు సింహాసనాన్ని అధిషించగలిగాడు. జుల్ఫీకర్ ఖాన్ మొగలు ఆస్థానంలో ఇరానీ గ్రూపుకు చెందినవాడు. జహాందర్ షా జుల్ఫీకర్ ఖాన్ కు వజీర్ పదవినిచ్చి గౌరవించాడు. తురానీలు అనగా మధ్య ఆసియా భూభాగానికి చెందినవారు. నూర్జహాన్ ను అనుకరిస్తూ జహాందర్ షా పాలనను ప్రభావితం చేసిన అతడి రాణి లాల్ కున్వర్. జహాందర్ షా పాలనా కాలంలో ప్రాచుర్యం లో ఉన్న మూడు గ్రూపులు తురనీలు, ఇరానీలు, హిందుస్తానీలు. ఇరానీలు అనగా పర్షియా, కోరసాన్ ల నుండి వచ్చినవారు. హిందూస్తానీలు అనగా విదేశాలకు చెందిన వారికి భారతదేశంలో జన్మించిన వారు, దిర్హాకాలంగా భారతదేశంలో స్థిరనివాసం, ఏర్పర్చుకున్నవారు. (హిందూరాజులు, అధికారులు కూడా వీరిలో ఉండేవారు). జహాందర్ షా పాలనాకాలములో రాజాస్థానంలో తురానీలు, ఇరానీల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. అధికారులు 'కింగ్మేకర్లూ' గా వ్యవహరించడం జూల్ఫీకర్ ఖాన్ తో ప్రారంభమైంది. జహాందర్ షా అంబర్ రాజు జైసింగ్ కు మీర్జారాజా సవాయ్ బిరుదునిచ్చి మాళ్వ ప్రాంతానికి సుబేదారుగా నియమించాడు. జహాందర్ షా మార్వార్ రాజు అజిత్ సింగ్ కు 'మహారాజా' బిరుదునిచ్చి గుజరాత్ ప్రాంతానికి సుబేదారుగా నియమించాడు. జహాందర్ షా పాలనాకాలంలో 'ఇజారా' (Ijarah) పద్దతిని ప్రారంభించింది జూల్ఫీకర్ ఖాన్. మొగలు చక్రవర్లులలో మొదటి కీలుబొమ్మ రాజు (Puppet Emperor) గా గుర్తించబడినది జహాందర్ షా. జహాందర్ షా ను హత్యచేసి సయ్యద్ సోదరుల సహాయంతో అధికారాన్ని చేపట్టినది ఫరుక్ సియర్.
No comments:
Post a Comment