Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Tuesday, 24 January 2023

TCS సంచలన నిర్ణయం.. డిగ్రీ పాసైన ఫ్రెషర్లకు సుమారు 40,000 సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. ఏడాదికి రూ.3 లక్షల వరకూ జీతం

TCS India Careers : భారీస్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవల 'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌- 2023'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ ద్వారా భారీ సంఖ్యలో ఫ్రెషర్స్‌ని నియమించుకుంటున్న విషయం కూడా విధితమే.

TCS Smart Hiring 2023 : దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS).. భారీస్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవల 'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌- 2023'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ ద్వారా భారీ సంఖ్యలో ఫ్రెషర్స్‌ని నియమించుకుంటున్న విషయం కూడా విధితమే. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే..

విద్యార్హతలివే:
బీసీఏ, బీఎస్‌సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), కంప్యూటర్ సైన్స్, ఐటీలో బ్యాచిలర్స్ ఇన్ వొకేషనల్ ఉత్తీర్ణులై ఉండాలి. 2020, 2021, 2022 లో పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పాస్ అయి, ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

విద్యార్థులకు టెన్త్, ఇంటర్, డిగ్రీలో 50 శాతం మార్కులు లేదా సీజీపీఏ 5 వస్తే చాలు. 2023 లో డిగ్రీ రాసిన అభ్యర్థులకు ఒక బ్యాక్‌లాగ్ ఉన్నా దరఖాస్తు చేయొచ్చు. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ నియామకాలు పూర్తయ్యేనాటికి బ్యాక్‌లాగ్ క్లియర్ చేయాలి. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌లో రాణించిన అభ్యర్థులకు టీసీఎస్ ఇగ్నైట్, టీసీఎస్ యూనిక్ సైన్స్ టు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో చేరే అవకాశం లభిస్తుంది.

సుమారు 40,000 మంది ఎంపిక:
టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ ప్రక్రియ ద్వారా ఏటా దాదాపు 35 వేల నుంచి 40 వేల మంది వరకూ ఫ్రెషర్స్‌ను రిక్రూట్‌ చేసుకుంటోంది. ఈ సంఖ్యను ప్రతి ఏటా సంస్థ నియామక ప్రణాళిక ఆధారంగా నిర్ధారిస్తున్నారు. జాతీయ స్థాయిలో దాదాపు రెండువేలకు పైగా ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు ఈఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఆరు నెలల శిక్షణ టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి ఆఫర్‌ ఖరారు చేసుకున్న వారికి ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారు. కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ అంశాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్,బిహేవియర్‌ స్కిల్స్, ఇతర సాఫ్ట్‌ స్కిల్స్‌లోనూ నైపుణ్యం పొందేలా శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు వారి ఆసక్తి మేరకు ఐటీ లేదా బీపీఎస్‌ విభాగాల్లో నియామకాలు ఖరారు చేస్తారు. రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది.

మూడు దశల ఎంపిక ప్రక్రియ
టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ విధానంలో మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి..రాత పరీక్ష, టెక్నికల్‌ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఇంటర్వ్యూ. తొలిదశ రాత పరీక్ష ఫిబ్రవరి 10వ తేదీన టీసీఎస్‌ ఐయాన్‌ సెంటర్లలో జరుగుతుంది.

3 విభాగాల్లో రాత పరీక్ష:
తొలుత ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల(వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ, న్యూమరిక్‌ ఎబిలిటీ) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 15–20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

పరీక్ష వ్యవధి 50 నిమిషాలు
రెండో దశ.. టెక్నికల్‌ ఇంటర్వ్యూ ఆన్‌లైన్‌ టెస్ట్‌లో సంస్థ నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు సాధించిన వారిని తదుపరి దశ టెక్నికల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ దశలో ఐటీ రంగానికి సంబంధించిన అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానం,సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఆసక్తి, అకడమిక్‌ నేపథ్యం ఆధారంగా సంబంధిత సబ్జెక్ట్‌లలో నైపుణ్యాలను పరీక్షిస్తారు. చివరగా హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ టెక్నికల్‌ ఇంటర్వ్యూలోనూ విజయం సాధించిన వారికి చివరగా హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ ఉంటుంది.ఇందులో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని,నాయకత్వ లక్షణాలను,సాఫ్ట్‌ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో నూ విజయం సాధిస్తే.. నియామకం ఖరారు చేసి.. ఆరు నెలలపాటు నిర్వహించే శిక్షణకు పంపుతారు.

రాత పరీక్షలో విజయం సాధించాలంటే:
తొలి దశగా నిర్వహించే రాత పరీక్షలో.. 3 విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. అవి.. వెర్బల్‌ ఎబిలిటీ యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్‌,ది ఎర్రర్, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్స్, యాక్టివ్‌–ప్యాసివ్‌ వాయిస్, క్లోజ్‌ టెస్ట్, వెర్బల్‌ అనాలజీస్, సెంటెన్స్‌ కరెక్షన్, పేరా రైటింగ్, కాంప్రహెన్షన్, ఇడియమ్స్, ఫ్రేజెస్, డైరెక్ట్‌–ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఇంగ్లిష్‌ గ్రామర్‌పై పదో తరగతి స్థాయిలో పూర్తి అవగాహన పొందాలి. అదే విధంగా సెంటెన్స్‌ ఫార్మేషన్, కరెక్షన్, కాంప్రహెన్షన్‌ల కోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్స్‌ చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.

రీజనింగ్‌ ఎబిలిటీ
ఈ విభాగంలో కోడింగ్, డీ కోడింగ్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ ఆర్గ్యుమెంట్స్, బ్లడ్‌ రిలేషన్స్, అనాలజీ,సిరీస్, పజిల్స్, లెటర్‌ సిరీస్, వెన్‌ డయాగ్రమ్స్, విజువల్‌ రీజనింగ్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

న్యూమరికల్‌ ఎబిలిటీ
ఈ విభాగంలో ఫ్రాక్షన్స్,ప్రాబబిలిటీ, సిరీస్‌ అండ్‌ ప్రోగ్రెషన్స్, యావరేజెస్, ఈక్వేషన్స్, ఏరియా,స్సేస్, పెరిమీటర్, రేషియోస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, వర్క్‌ అండ్‌ టైమ్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, జామెట్రీ, పెర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్, నంబర్‌ సిస్టమ్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎం, పర్సంటేజెస్‌ వంటి ప్యూర్‌ మ్యాథ్స్, అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి సమాధానం ఇవ్వడం కోసం 12వ తరగతి స్థాయిలోప్యూర్‌ మ్యాథ్స్, అదే విధంగా అర్థమెటిక్‌ పుస్తకాలు అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సగటున 50 సెకన్ల నుంచి ఒక నిమిషం వ్యవధి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.

TCS Smart Hiring 2023 - ముఖ్య సమాచారం:

  • వయసు: అభ్యర్థుల వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
  • పని ప్రదేశం: దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • పరీక్షా విధానం:
  • టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అభ్యుర్థులను ఎంపిక చేసేందుకు 50 నిమిషాలు పాటు టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. నేరుగా ఉద్యోగంలో చేరవచ్చు.
  • దరఖాస్తులకు చివరితేది: జనవరి 31, 2023
  • పరీక్ష తేది: ఫిబ్రవరి 10, 2023


పూర్తి వివరాలకు లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

No comments:

Post a Comment