ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియను తాజాగా ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల (AP Constable Jobs) భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) నియామక ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జనవరి 22న నిర్వహించింది. పరీక్ష నిర్వహించిన కేవలం 15 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసి సంచలనం సృష్టించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఈ ఫలితాలు ఫిబ్రవరి 5న విడుదలయ్యాయి. మొత్తం 4,59,182 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు మాత్రమే రెండో దశ అయిన ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. ఈ అభ్యర్థులు స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఇందుకు ఫిబ్రవరి 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలంటే?
Step 1: అభ్యర్థులు మొదటగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://slprb.ap.gov.in/ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో SCT PC STAGE 2 online application లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం మీ రిజిస్ట్రేషన్ నంబర్, టెన్త్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
Step 4: మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. వివరాలు నింపి సబ్మిట్ చేయాలి.
Step 5: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.
No comments:
Post a Comment