బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కోల్ మైనింగ్ లో పని చేయుటకు 405 మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తులు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మైనింగ్ సిర్దార్ షిప్ సర్టిఫికెట్/ఫస్ట్ ఎయిడ్ అండ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్/సర్వే సర్టిఫికేట్/సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల యొక్క వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిబ్రవరి 23, 2023వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జనరల్ , బీసీ అభ్యర్ధులు రూ.1180లు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/వికలాంగ/మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31,852ల వరకు జీతంగా చెల్లిస్తారు.
No comments:
Post a Comment