ప్రభుత్వ ఉద్యోగాల గురించి పక్కన పెడితే ములుగు జిల్లా (Mulugu District) ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు వరుస జాబ్ మేళా (Job Mela) నిర్వహిస్తూ వారికి ఉపాధి కల్పించడంలో ఐటిడిఏ ఏటూరు నాగారం కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఐటీడీఏ ఆధ్వర్యంలో రెండు జాబ్ మేళాలను నిర్వహించగా గిరిజన అభ్యర్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఇప్పటివరకు దాదాపు 200 మందికి పైగా ఉద్యోగాలు సంపాదించారు. అంతేకాకుండా జాబ్ మేళాలపై ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రత్యేక దృష్టి పెట్టి వివిధ ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో ఉండే యువతీ, యువకులకు మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడం కోసం జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ములుగు జిల్లా కేంద్రంగా యూత్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఐటీడీఏ ఏటూరు నాగారం పరిధిలోని అభ్యర్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ జాబ్ మేళాకు దాదాపు 800 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో దాదాపు 200 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలలో జాయిన్ అయ్యారు. భూపాలపల్లి కేంద్రంగా తలిమెల ప్రాంతంలో నిర్వహించిన జాబ్ మేళాలో సైతం అభ్యర్థుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు 15 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. ఈ నేపథ్యంలోనే ఐటిడిఏఏటూరు నాగారం మరో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరు నాగారం పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మార్చి 3వ తేదీన వాజేడు మండల కేంద్రంలో జాబ్ మేళాను నిర్వహించినట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటిఐ, డిప్లమా, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ, బిటెక్ చదివిన అభ్యర్థులు అందరూ అర్హులేనని.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వారి విద్యార్హతల ఒరిజినల్, ఒక కాపీ జెరాక్స్ తీసుకురావాలని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరములు లోబడిన అందరూ ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చని చెప్పారు. ఆసక్తిగల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు వాజేడు మండల కేంద్రంలో నిర్వహించే జాబ్ మేళాకు హాజరై.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ అధికారులు కోరుతున్నారు. గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 94903 41911, 80089 32159 నెంబర్లను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
No comments:
Post a Comment