ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ తేదీని ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (APSLPRB) విడుదల చేసింది. 2023, మార్చి 13వ తేదీ నుంచి పీఎంటీ/ పీఈటీని నిర్వహించనున్నట్లు సంస్థ అధికారులు సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేశారు. స్టేజీ 2 దరఖాస్తు నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 20వ తేదీన ముగియడంతో.. తదుపరి రిక్రూట్‌మెంట్ వివరాలను ప్రకటనలో పొందుపరిచారు. పీఎంటీ/ పీఈటీ కాల్‌లెటర్లు మార్చి 01, 2023 నుంచి మార్చి 10, 2023 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Sir prilims exam lo markes add avuthai annaru nijamenaa
ReplyDelete