భారతీయ రైల్వేకు సంబంధించి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పలు ఉద్యోగాల
భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ డీ
ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్సీఎఫ్ ప్రధాన కార్యలయం అయిన చెన్నైలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ
నోటిఫికేషన్ ద్వారా వెలువడిన పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ
చేయనున్నారు. గ్రూఫ్ డీ కేటగిరీలో 2022-23 ఏడాదికి ఈ నియామకాలు
జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇక్కడ చెప్పిన క్రీడల్లో
ప్రావీణ్యం ఉండాలి. ఫుట్ బాల్, బాడీ బిల్డింగ్ , కబడ్డీ , హాకీ , క్రికెట్ , వెయిట్ లిఫ్టింగ్ .
వీటితో పాటు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ
ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి
ఉంటుంది. అభ్యర్థులను ట్రయల్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులను అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్/రిక్రూట్ మెంట్, ఇంటిగ్రల్ కోచ్
ఫ్యాక్టరీ, చెన్నై చిరునామాకు పంపాలి. ట్రయల్స్‌ను మార్చి 28,29 తేదీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ మార్చి 13వ తేదీతో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల కొరకు ఈ వెబ్ సైట్ https://pb.icf.gov.in/index.php ను సందర్శించి తెలుసుకోవచ్చు.
No comments:
Post a Comment