తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్
(TSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. కోర్టు ఆదేశాలతో ఇటీవల ప్రిలిమ్స్
పరీక్షలో (TS Police Jobs Prelims) అభ్యర్థులకు ఏడు మార్కులను కలిపిన విషయం
తెలిసిందే. ఈ మార్కులను కలపడంతో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రస్తుతం
ఈవెంట్స్ ను నిర్వహిస్తోంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.
ఈ సందర్భంగా ఈవెంట్స్ లో గర్భిణులు, బాలింతలకు మినహాయింపు ఇచ్చింది.వారు
నేరుగా తుది పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించింది. ఫైనల్ ఎగ్జామ్ కు
సంబంధించిన ఫలితాలు విడుదలైన నెల రోజుల్లో వారు ఈవెంట్స్ లో అర్హత
సాధించాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఈ మినహాయింపు పొందాలనుకుంటున్న వారు రాత పూర్వక అండర్ టేకింగ్ ను సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోగా అండర్ టేకింగ్ ను Director General of
Police, Telangana State, Lakdi-ka-pul, Hyderabad చిరునామాలో
సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రొఫార్మాను పైన అటాచ్ చేసిన
పీడీఎఫ్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు అభ్యర్థులు సంబంధితన
బోనఫైడ్ మెడికల్ సర్టిఫికేట్ ను సైతం జత చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. కళాశాల విద్యాశాఖ కింద డిగ్రీ కాలేజీల్లో మొత్తం 544 ఉద్యోగాల (Jobs) భర్తీకి డిసెంబరు 31న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ (TSPSC Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ వాస్తవానికి జనవరి 31న ప్రారంభం కావాల్సి ఉండగా.. ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు. అయితే.. తాజాగా మరో సారి దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలిపింది. మార్చి 20వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. మే లేదా జూన్‌లో నియామక పరీక్ష నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment