హైదరాబాద్ మెట్రో రైల్‌లో (Hyderabad Metro Rail) ఉద్యోగం కోరుకుంటున్నారా? పలు ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
నిరుద్యోగులకు అలర్ట్. హైదరాబాద్ మెట్రో రైల్‌లో (Hyderabad Metro Rail) పలు ఖాళీలు ఉన్నాయి. ఏఎంఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి. హైదరాబాద్ మెట్రో రైలులో మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. ఏఎంఎస్ ఆఫీసర్- 1, సిగ్నలింగ్ టీమ్- 2, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్- 6, ట్రాక్స్ టీమ్ లీడర్- 2, ఐటీ ఆఫీసర్- 1 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అనుభవం కూడా తప్పనిసరి. ఏఎంఎస్ ఆఫీసర్ పోస్టుకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. సిగ్నలింగ్ టీమ్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ పోస్టుకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. ట్రాక్స్ టీమ్ లీడర్ పోస్టుకు సివిల్, మెకానికల్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉండాలి. ఐటీ ఆఫీసర్ పోస్టుకు బీటెక్, ఎంసీఏ, ఎంఎస్‌సీ పాస్ కావాలి. 1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా https://www.ltmetro.com/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Careers సెక్షన్ ఓపెన్ చేయాలి. Current Oppurtunities పైన క్లిక్ చేయాలి. విద్యార్హతల వివరాలన్నీ పూర్తిగా చదవాలి. దరఖాస్తు ఫామ్ ప్రిపేర్ చేసి KeolisHyd.Jobs@keolishyderabad.com మెయిల్ ఐడీకి పంపాలి.
No comments:
Post a Comment