TSLPRB : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పరీక్షల్లో.. నిర్దేశిత ఎత్తు కంటే సెంటీమీటర్ లేదా ఆలోపు తక్కువ ఎత్తు కారణంగా అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) మరో అవకాశం కల్పించింది. ఇలా అనుత్తీర్ణులైన కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాంటి వారి ఎత్తును మరోసారి పరీక్షించాలని కోర్టు ఆదేశించడంతో TSLPRB ఈ నిర్ణయం తీసుకొంది. ఒక్క సెం.మీ. లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో అనుత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మండలి తెలిపింది. www.tslprb.in వెబ్‌సైట్‌లో ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 12న రాత్రి 8 గంటల్లోపు వ్యక్తిగత లాగిన్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని TSLPRB ఛైర్మన్ వి.వి.శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఎస్‌ఏఆర్ సీపీఎల్, కొండాపూర్‌లోని 8వ బెటాలియన్ మైదానాల్లో వీరికి ఎత్తు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. దరఖాస్తు పత్రాన్ని పరీక్ష సమయంలో వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందని TSLPRB చైర్మన్ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment