ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల (Government Jobs) తో పోలిస్తే, దానికి అనుగుణంగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్ వాడీలలో కార్యకర్తల, హెల్పర్ల పోస్టులకు (Anganwadi Posts) భారీగానే నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఉత్వర్వులు జీవో.నెం 21, 28, 38, 39, 7, 15, 8, 1, 25 ప్రకారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి (East Godavari District) లో ప్రతి మండలానికి పోస్టులను కేటాయించారు. ముఖ్యంగా రోస్టర్ విధానం ప్రకారం ఈపోస్టులను కేటాయించారు.ఇందులో జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు, ఎక్స్ ఆర్మీ కోటా కింద పోస్టులున్నాయి. గ్రామం/ పట్టణంలో ఉండి నెలకు రూ.11,500 జీతం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈపోస్టుకి కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. స్థానికులైన వివాహితులు మాత్రమే అర్హులు. సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుతో పాటు పదవతరగతి మార్కుల జాబితా, టీసీ, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను జతపరచాలి. ఈ నెల అంటే, మార్చి 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. చాలా కాలం తర్వాత పోస్టుల భర్తీ చేయడంతో పోటీ ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతల సిఫార్సులతో పోస్టుల భర్తీ జరుగుతుందన్న ప్రచారం కూడా ఎక్కువ ఉండటంతో నేతల చుట్టూ ప్రదక్షణలు మొదలయ్యాయి. ఈ ఉద్యోగానికి ఎంపికైతే స్థానికంగా ఉండి అక్కడ పరిసర ప్రాంతాల్లో 3 ఏళ్లలోపు వయస్సు గల చిన్న పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం, బాలింతలు, గర్భీణీలకు ప్రభుత్వం ద్వారా అందించే పౌష్టికాహారం అంటే గుడ్లు, తినే పిండి పదార్థాలు, బెల్లపు అచ్చులు, పాలు వంటివి అందించడం చేయాలి. గర్బిణీల వివరాలను పొందుపరచాలి. దీంతోపాటు ప్రభుత్వం నిర్వహించే జనాభా సర్వేలు, ఇతర సర్వేలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతినెలా ఆయా నియోజకవర్గంలోని సీడీపీవో కార్యాలయంలో సమావేశానికి హాజరుకావాలి. కేంద్ర ప్రభుత్వం పిల్లలు, తల్లుల రక్షణకు సంబంధించిన పథకాలను ప్రజలకు చేరవేసేందుకు అంగన్‌వాడీ టీచర్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిలల్ల సంరక్షణతోపాటు, పరిసర ప్రాంతాల్లో బాల్య వివాహాలను, స్త్రీల సంరక్షణకు సమాచార వారధిలా పనిచేయాల్సి ఉంటుంది. సమాజంలో గౌరవంతోపాటు, టీచర్ అనే హోదా దక్కుతుంది. ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగానే అంగన్‌వాడీ టీచర్ ను పరిగణిస్తారు.
No comments:
Post a Comment