తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కు సంబంధించిన పేపర్లు లీక్ కావడంతో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. ఎప్పుడు ఏ పరీక్ష ఉంటుందో తెలియని గందరగోళంగా మారింది. ఇందుకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా టీఎస్పీఎస్సీ నాలుగు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. మరో 2 పరీక్షలను వాయిదా వేసింది. గ్రూప్1 ప్రిలిమ్స్, డీఏవో, ఏఈ, ఏఈఈ, సీడీపీవో, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ పరీక్షలను నిర్వహించింది. లీకేజీ వ్యవహారంతో వీటిలో నాలుగు ఎగ్జామ్స్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు సబంధించిన కొత్త తేదీల ప్రకటనపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. మరో వారం రోజుల్లో ఈ పరీక్షల తేదీలను ప్రకటించానలి భావిస్తోంది. మే నెలలో ఆ పరీక్షలను నిర్వహించాని కమిషన్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
No comments:
Post a Comment