దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి(లెవెల్-1) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి(లెవెల్-1) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. లెవెల్-1 ఖాళీల భర్తీకి సంబంధించి ఆగస్టు 17, 2022 నుంచి అక్టోబర్ 11, 2022 మధ్యకాలంలో ఆన్ లైన్ విధానంలో పరీక్షలను నిర్వహించారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 12 నుంచి 22 వరకు ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్ష నిర్వహించారు. అనంతరం ఫిబ్రవరి 7 నుంచి 13 వరకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్స్‌ను పూర్తిచేశారు. ఇలా అన్నింటికిలో అర్హత సాధించిన వారు 7,305మంది ఉన్నారు. వీరికి సంబంధించి తుది జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇక వీటిలో .. స్టోర్, డీజిల్, ఎలక్ట్రికల్, వర్క్‌షాప్ తదితర విభాగాల్లో అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో పైలట్, అసిస్టెంట్ వర్క్స్, పాయింట్స్‌మెన్ తదితర పోస్టులు ఉన్నాయి. దాదాపు 9వేలకు పైగా ఖాళీలతో 2019లో ఈ గ్రూప్ డీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇటీవల కేంద్ర మంత్రి రైల్వేలో దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. వాటికి సంబంధించి నోటిఫికేషన్లు ఏప్రిల్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిలో గ్రూప్ డీ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 10వేలకు పైగా ఖాళీలు ఉండగా.. వీటిలో గ్రూప్ డీ పోస్టులే అధికంగా ఉన్నాయి. వీటితో పాటు.. జూనియర్ ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్ , నాన్ టెక్నికల్, అసిస్టెంట్ లోకోపైలెట్ వంటి పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ డీ 2019 నియామక ప్రక్రియ ముగిసిన వెంటనే వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
No comments:
Post a Comment