తెలంగాణలో 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్(Notification) వెల్లడి కాగా.. ప్రస్తుతం మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో.. టెక్నికల్ పరీక్షలకు చివరి రాత పరీక్షల షెడ్యూల్ ను 13 జనవరి 2023న ప్రకటించారు. దీనిలో భాగంగానే.. PTOలో SCT PC (డ్రైవర్) పోస్ట్/ఫైర్ సర్వీసెస్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు తుది పరీక్షకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎస్సీటీ పీసీ డ్రైవర్ / డ్రైవర్ ఆపరేటర్(Driver Operator) పోస్టులకు ఏప్రిల్ 02న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు SCT PC (మెకానిక్) పోస్టులకు నిర్వహించే పరీక్షను మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు పరీక్ష సెంటర్లను కేవలం హైదరాబాద్ లోనే(Hyderabad) నిర్వహించనున్నట్లు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ టెక్నికల్ పేపర్ కు సంబంధించి హాల్ టికెట్స్ ను మార్చి 28 రాత్రి నుంచి మార్చి 31 అర్థరాత్రి 12 గంటల వరకు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అభ్యర్థులు లాగిన్ ఆప్షన్ కు వెళ్లి.. ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేసి.. హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా సమస్యలు ఎదురైతే.. support@tasleeparb.in కు ఇ-మెయిల్ పంపవచ్చు లేదా 93937 11110 లేదా 93910 05006 నంబర్లలో సంప్రదించవచ్చు. హాల్ టికెట్స్ పై అభ్యర్థి యొక్క ఫొటో అనేది తప్పనిసరిగా ఉండాలని.. హాల్ టికెట్స్ పై ఫొటో లేకపోతే.. పరీక్షకు అనుమతించమని తెలిపారు. దరఖాస్తు సమయంలో ఎలాంటి ఫొటోను అప్ లోడ్ చేశారో.. అదే పాస్ ఫొటోను హాల్ టికెట్స్ పై అంటించాలని పేర్కొన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమ ప్రశ్నపత్రాన్ని తీసుకెళ్లవచ్చని తెలిపారు. అభ్యర్థులు OMR జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్ కు అందజేయాలని పేర్కొన్నారు. పరీక్ష సమయం కంటే ముందే అభ్యర్థులను హాలు నుంచి బయటకు పంపించడం కుదరదని ప్రెస్ నోట్ లో పోలీస్ నియామక బోర్డు తెలిపింది.. ఇక అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ ను రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చివరి ముగింపు వరకు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.
No comments:
Post a Comment