ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కాటన్ యూనివర్సిటీ నుంచి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం ఇన్‌స్టిట్యూట్‌లో వాచ్‌మెన్, గార్డెనర్‌తో సహా అనేక పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక సైట్ cottonuniversity.ac.in సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 2న నిర్ణయించబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్యూన్/ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 12, హాస్టల్ బేరర్ 13, చౌకీదార్ 7, కుక్ 6, గార్డనర్ 5, ఆయా పోస్టులు 2 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా.. అభ్యర్థి కంప్యూటర్ నైపుణ్యం / డ్రైవింగ్ / ANM (సహాయక నర్స్ మిడ్‌వైఫ్ / DTP / గుర్తింపు పొందిన క్యాటరింగ్ నుండి అనుభవం కలిగి ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 38 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.12,000 నుంచి రూ.52,000 వరకు జీతం ఇవ్వబడుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 500 చెల్లించాలి. అదే సమయంలో రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250గా నిర్ణయించారు.
దరఖాస్తు వివరాలు
- మొదట అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి
- దీనిలో గ్రూప్ 4 ఉద్యోగాల దరఖాస్తులపై క్లిక్ చేయండి
- దీనిలో పేర్కొన్న విధంగా కేటగిరీల వారీగా ఉద్యోగాలను ఎంపిక చేయాలి
- తర్వాత న్యూ అప్లికేషన్ పై క్లిక్ చేసి.. వివరాలను నమోదు చేయాలి
- చివరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
ముఖ్యమైన లింక్స్
- అధికారిక సైట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment