Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Monday, 15 May 2023

భారత రాజ్యాంగం

 ఒక దేశ పరిపాలనను వివరించే అత్యున్నత శాసనమే రాజ్యాంగం. దీనిలో ప్రభుత్వం ఏర్పడే విధానం, ఎన్నికల ప్రక్రియ, పాలకులు, పాలితులు, అనుసరించాల్సిన నియమాలు వివరించి ఉంటాయి. భారత రాజ్యాంగం- డా. బాబూ రాజేంద్ర ప్రసాద్‌ అధ్యక్షతన రాజ్యాంగసభ పర్యవేక్షణలో రూపొందింది. ఈయన భారతదేశానికి తొలి రాష్ట్రపతి.

భారత రాజ్యాంగం

– బ్రిటన్‌ దేశానికి లిఖిత రాజ్యాంగం లేదు.అలిఖిత రాజ్యాంగం ఉంది.

-ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం గల దేశం- అమెరికా.

– ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం- భారత్‌

-రాజనీతి శాస్త్ర పితామడు ‘అరిస్టాటిల్‌’ (గ్రీకు) రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించారు.

– అరిస్టాటిల్‌ ప్రఖ్యాత రచన- పాలిటిక్స్​​‍ (Politics).

-రాజ్యాంగ సభ/ రాజ్యాంగ పరిషత్‌ (భారత్‌కు తాత్కాలిక పార్లమెంట్‌)

భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తామని తొలిసారిగా ఆంగ్లేయులు 1942 నాటి క్రిప్స్​‍ రాయభారం ద్వారా ప్రతిపాదించారు.

‘క్రిప్స్​‍ రాయబారాన్ని’ ‘Post dated check’ గా దివాలా తీసిన బ్యాంక్‌చెక్‌గా అభివర్ణించి గాంధీ తిరస్కరించారు.

బ్రిటన్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ 1946లో భారత్‌కు క్యాబినెట్‌ మిషన్‌(మంత్రిత్వ రాయభారాన్ని) పంపారు.

క్యాబినెట్‌ మిషన్‌లోని సభ్యులు

1. పెథిక్‌ లారెన్స్​‍

2. స్ట్రాఫర్డ్ క్రిప్స్​‍

3. ఏవీ అలెగ్జాండర్‌

-క్యాబినెట్‌ మిషన్‌ సిఫారసుల మేరకు 1946 జూలైలో రాజ్యాంగసభకు ‘పరిమిత ఓటింగ్‌’తో ‘పరోక్ష ఎన్నికలు’ జరిగాయి.

ఎన్నికైన సభ్యులు

– ఇందులో రాష్ట్రాల నుంచి-292

– స్వదేశీ సంస్థానాల నుంచి- 93

– కేంద్రపాలిత ప్రాంతాల నుంచి- 4 ( ఢిల్లీ, అజ్మీర్‌, మేవార్‌, కూర్గ్, బ్రిటిష్‌ బెలుచిస్థాన్‌ (పాకిస్థాన్‌)

– రాజ్యాంగ సభలో 69శాతం స్థానాలను అంటే- 202 స్థానాలు ఐఎన్‌సీ (ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్) విజయం సాధించగా, ముస్లింలీగ్‌ 73, స్వతంత్ర అభ్యర్థులు 7 స్థానాల్లో గెలిచారు.

రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళలు-15

-ఎస్సీ వర్గాలకు సంబంధించిన వారు- 26

– స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ సభలో గల సభ్యుల సంఖ్య- 299

– వీరిలో మహిళలు- 9

– రాజ్యాంగసభకు ఎన్నికైన తెలుగువారు-

1. సరోజినీనాయుడు- దేశంలో తొలి మహిళా గవర్నర్‌గా (ఉత్తరప్రదేశ్‌) పనిచేశారు.

2. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌- ప్రముఖ సంఘ సంస్కర్త, కేంద్రసాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలు.

3. ఆచార్య ఎన్జీరంగా- ప్రముఖ వ్యవసాయరంగ నిపుణులు.

4. టంగుటూరి ప్రకాశం- 1953 అక్టోబర్‌ 1న ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి.

– ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలిమహిళ- విజయలక్ష్మీ పండిట్‌. ఈమె భారత్‌ తరఫున తొలి

మహిళా విదేశీరాయబారిగా సోవియట్‌ రష్యాలో పనిచేశారు.

– భారత్‌లో తొలిమహిళా ముఖ్యమంత్రి- సుచేత కృపలాని (యూపీ).

– తొలి క్యాబినెట్‌ మహిళా మంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ)- రాజకుమారి అమృత్‌కౌర్‌.

-రాజ్యాంగ సభలో మహిళలకు ప్రాతినిధ్యం వహించినవారు-హంసా మెహతా. ఈమె 1947 జూలై 22న జాతీయ పతాకాన్ని

‘రాజ్యాంగ సభలో’ ప్రతిపాదించి ఎగురవేశారు.

రాజ్యాంగపరిషత్‌లో సభ్యత్వం లేని ప్రముఖులు

మహాత్మాగాంధీ

మహ్మద్‌ అలీ జిన్నా

రాజ్యాంగ రచనకు-రాజ్యాంగ సభ జరిపిన కృషి-

-ఏర్పాటు చేసిన కమిటీలు – 22

-నిర్వహించిన సమావేశాలు- 11

-రాజ్యాంగ రచనకు పట్టిన సమయం- 2 సంవత్సరాల 11నెలల 18 రోజులు.

-రాజ్యాంగ సభకు సలహాదారుడు- బెనెగల్‌ నరసింగరావు(బీఎన్‌ రావు)

నెదర్లాండ్స్​‍లో ని దిహేగ్‌ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు.

-రాజ్యాంగ సభ చిహ్నం

– ఏనుగు (ఐరావతం)

– అయిన ఖర్చు- రూ. 64లక్షలు

– చేతిరాత -ప్రేమ్‌ బీహారి నారాయణ రైజాఖ్‌

-కేంద్ర రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు

– జవహర్‌లాల్‌ నెహ్రూ

-రాష్ట్ర రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు

– సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

-అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ అధ్యక్షుడు

– హెచ్‌సీ ముఖర్జీ

– రాజ్యాంగ ముసాయిదా డ్రాప్టింగ్‌ కమిటీ అధ్యక్షుడు – డా. బీఆర్‌ అంబేద్కర్‌

నియమావళి కమిటీ

-సారథ్య సంఘం/ స్టీరింగ్‌ కమిటీ-డా. బాబు రాజేంద్రప్రసాద్‌

రాజ్యాంగ తొలి ప్రతులు

-మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన మరో 8మంది సభ్యులతో కూడిన బృందం, భారత్‌కు అవసరమైన తొలి రాజ్యాంగాన్ని 1928లో రూపొందించింది.

-ఇది అమల్లోకి రాకపోయినప్పటికీ, చరిత్రలో ‘నెహ్రూ రిపోర్ట్‍’గా నిలిచింది.

యంగ్‌ ఇండియా పత్రిక (1931)

– 1931లో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన ‘కరాచీ’లో జరిగిన INC (ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్)’ సమావేశం భారత్‌కు ఎలాంటి రాజ్యాంగం ఉండాలో తీర్మానించింది.

-పైన పేర్కొన్న రెండు పత్రాల్లో భారతీయులకు ప్రాథమిక హక్కులు, సార్వజనీన వయోజన ఓటుహక్కు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

– 1931లో గాంధీజీ ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో భారతదేశానికి తాను ఎలాంటి రాజ్యాంగాన్ని ఆశిస్తున్నాడో తెలియజేస్తూ కింది విధంగా పేర్కొన్నారు.

-‘‘భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషిచేస్తాను. అత్యంత నిరుపేదలు ఇది తమదేశం అని, దీని నిర్మాణంలో తమకు పాత్ర ఉందని భావించే భారతదేశం కోసం నేను కృషిచేస్తాను. ఇలాంటి దేశంలో నిమ్నవర్గ, సంపన్న అనే వ్యత్యాసాలు ఉండరాదు. అన్నిమతాలు, జాతుల వారు సామరస్యంతో ఉండే భారతదేశం కోసం నేను కృషిచేస్తాను. ఇలాంటి దేశంలో అంటరానితనం అనే శాపం, మత్తుమందులు, మత్తుపానీయాలు అనే శాపం ఉండరాదు’’. స్త్రీలకు కూడా పురుషులతో సమానమైన హక్కులు ఉండాలి. ఇంతకంటే తక్కువదానితో నేను సంతృప్తిపడను’’.

జవహర్‌లాల్‌ నెహ్రూ ఉద్దేశాల తీర్మానం (1946 డిసెంబర్‌ 13)-

– జవహర్‌లాల్‌ నెహ్రూ రాజ్యాంగసభలో ఉద్దేశాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ‘చారిత్రక లక్ష్యాల ఆశయాల

తీర్మానంగా’ పేర్కొంటారు.

దీనిలోని ముఖ్యాంశాలు-

1. భారతదేశం ప్రపంచశాంతి కోసం, మానవాళి సంక్షేమం కోసం కృషిచేస్తుంది.

2. అల్పసంఖ్యాక, గిరిజన, అణగారిన వర్గాల ప్రయోజనాలు పరిరక్షించబడాలి.

3. పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కల్పించాలి.

4. దేశంలో గల వివిధ రాష్ట్రాలు, ప్రజాస్వామ్యయుతంగా స్వయం ప్రతిపత్తితో వర్ధిల్లాలి.

– జవహర్‌లాల్‌ నెహ్రూ (1947 ఆగస్టు 15 అర్ధరాత్రి) రాజ్యాంగ సభలో కింది విధంగా ప్రసంగించారు.

-‘‘నేటి నుంచి మనం సుఖశాంతులతో విశ్రాంతి భవనాల్లో ఉండే రోజులు పోయాయి. ఎందుకంటే గతంలో మనం ప్రజలకు చేసిన ప్రతిజ్ఞలు, నేడు చేస్తున్న ప్రతిజ్ఞ నిలుపుకోవడానికి నిరంతరం శ్రమించాలి. సమాజంలోని ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలి. మన తరం మహానాయకులు కలగన్నారు ఇది మనకు సాధ్యం కాకపోవచ్చును, కానీ కన్నీళ్లు కష్టాలు ఉన్నంతకాలం మన పని ఇంకా మిగిలే ఉంటుంది’’.

– డా.బీఆర్‌ అంబేద్కర్‌ (1950 జనవరి 26)-

-‘‘ నేటి నుంచి మనం, వైరుధ్యాల (Differ ences) తో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో అసమానతలు కొనసాగుతాయి. మన దేశంలో గల సామాజిక, ఆర్థిక చక్రం కారణంగా రాజకీయాల్లో ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే ఓటుకు ఒకే విలువ అనే దాన్ని కొనసాగిస్తున్నాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఒకే వ్యక్తి ఒకే విలువ అనే సూత్రాన్ని తిరస్కరిస్తున్నాం. ఈ వైరుధ్యాలు ఎంతకాలం కొనసాగాలి. ఇవి ఎక్కువకాలం కొనసాగితే మనం కష్టపడి రూపొందించుకున్న రాజకీయ ప్రజాస్వామ్యం ముప్పునకు గురవుతుంది.

-భారత రాజ్యాంగ రూపకల్పనకు ప్రేరణ కల్పించిన/ స్పూర్తినిచ్చిన అంశాలు-

– మనదేశంలో మెరుగైన సమాజం కోసం వివిధ వర్గాల ప్రజలు జరిపిన పోరాటాలు.

– మహాత్మాగాంధీ ఇతర జాతీయ నాయకుల ఆదర్శాలు.

-బ్రిటన్‌ పార్లమెంటరీ తరహా ప్రజస్వామ్యం.

– 1789 నాటి ఫ్రెంచ్‌ విప్లవ ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం.

– అమెరికా రాజ్యాంగంలో Bill of Rights గా పేరొందిన ప్రాథమిక హక్కులు.

– చైనా, రష్యాల్లో జరిగిన సోషలిస్టు మూలాలయిన సాంఘిక, ఆర్థిక అసమానతల నిర్మూలన.

-ఆంగ్లేయులు మనదేశాన్ని సుమారు 200 సంవత్సరాల పాటు పాలించారు. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలోని అనేక ప్రాంతాలు రాచరిక పాలనలో (హైదరాబాద్‌ నిజాం వలే) కొనసాగుతుంది. మతకల్లోలాల వల్ల దేశవిభజన జరిగింది. మనదేశ ‘జాతీయోద్యమం కేవలం విదేశీపాలనకు వ్యతిరేకంగా సాగింది కాదు. సమాజం నుంచి అసమానతలు, దోపిడీ, వివక్షతలను తొలగించేందుకు సాగింది’. స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్య సూత్రాల ఆధారంగా నిర్మించబడాలని జాతీయనాయకులు భావించారు.

ప్రజాస్వామ్య సూత్రాలు

– చట్టం ముందు అందరూ సమానులుగా ఉండాలి.

– పౌరులందరికీ ప్రాథమిక హక్కులు ఉండాలి.

-కుల, మత, భాష, ప్రాంత, జాతి మొదలైన వాటితో సంబంధం లేకుండా అర్హులందరకీ వయోజన ఓటు హక్కు కల్పించాలి.

రాజ్యాంగ ముసాయిదా కమిటీ/ డ్రాప్టింగ్‌ కమిటీ- 1947 ఆగస్టు 29

– 1947 ఆగస్టు 29న డా.బీఆర్‌ అంబేద్కర్‌ అధ్యక్షతన మరో ఆరుగురు సభ్యులతో రాజ్యాంగ ముసాయిదా కమిటీ/ డ్రాప్టింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

డా.బీఆర్‌ అంబేద్కర్‌- చైర్మన్‌

ఎన్‌ గోపాలస్వామి అయ్యంగార్‌

అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌

కేఎం మున్షీ

సయ్యద్‌ మహ్మద్‌ సాదుల్లా

బీఎల్‌ మిట్టల్‌

డీపీ ఖైతాన్‌

ఎన్‌ మాధవరావు

పీటీ కృష్ణమాచారి

పీఠిక (Preamble)

– మనదేశ రాజ్యాంగ ‘తాత్విక పునాదులు’ దీనిలో వివరించబడి ఉన్నవి.

– రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు, ప్రభుత్వ ఉద్దేశాలు ఇందులో కలవు.

– రాజ్యాంగంలోని 4వ భాగం ఆర్టికల్‌ 36-51 మధ్య రాజ్యవిధాన ‘ఆదేశిక సూత్రాల’ గురించి వివరించారు.

– దీనిలో ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహించాల్సిన అంశాలను పేర్కొన్నారు.

-వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.

– రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్‌ 12 నుంచి 35 మధ్య ‘ప్రాథమిక హక్కులను’ పేర్కొన్నారు. వీటికి న్యాయరక్షణ ఉంది.

ప్రభుత్వ వ్యవస్థలు

-రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్‌ నుంచి స్ఫూర్తి పొంది ‘పార్లమెంటరీ తరహా ప్రభుత్వ’ విధానాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం ఓటర్లచే ఎన్నికయిన ప్రజాప్రతినిధులు ప్రజల తరఫున పరిపాలన నిర్వహిస్తారు.

-పార్లమెంటు- దేశానికి అవసరమైన శాసనాలను రూపొందించడంతో పాటు వాటిని అమలు చేసేందుకు అవసరమైన ప్రభుత్వాన్ని అందిస్తుంది.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment