Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Tuesday, 16 May 2023

భారత రాజ్యాంగ పరిణామం

ప్రపంచంలో మొదటి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం (అలిఖిత రాజ్యాంగం)

– ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా, మొదటి లిఖిత, అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం

పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు పాలిటీ (polity)పై పట్టు సాధించాలంటే రాజ్యాంగం, అది ఎలా ఏర్పడింది అనే అంశాలు, చట్టాలు, ప్రతి చట్టంలోని ప్రధాన అంశాలపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా గ్రూప్ – II ప్రిపేరయ్యేవారు సిలబస్‌లోని ఐదు అంశాలపై పూర్తి అవగాహన రావాలంటే పరిణామం అనే అంశాన్ని (Topic) అధ్యయనం చేయాలి.

పౌరశాస్త్రం, రాజనీతి శాస్ర్తాలు గ్రీకు తత్వశాస్త్రం నుంచి ఆవిర్భవించాయి. రాజ్యాంగం అనే పదాన్ని గ్రీకు రాజనీతి తత్వవేత్త అయిన ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ తొలిసారిగా ఉపయోగించాడు. రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్.

రాజ్యాంగ లక్షణాలు

– ప్రజలు
– ప్రదేశం
– ప్రభుత్వం
– సార్వభౌమాధికారం
వీటితో పాటు ప్రతి రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు ఉండాలి. రాజ్యానికి ప్రభుత్వం గుండె లాంటిది, సార్వభౌమాధికారం ప్రాణం వంటిది. రాజ్యం విధులను ప్రభుత్వం నిర్వహిస్తుంది. సార్వభౌమాధికారం రాజ్యానికి అత్యున్నతమైనది. ఇది ప్రజలందరికీ ఉంటుంది. ప్రజలకు ఉన్న ఈ అధికారం ద్వారా తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.

రాజ్యం స్వరూపాన్ని నిర్ణయించే సూత్రాల సముదాయాన్ని రాజ్యాంగం అని ప్రొఫెసర్ గెటిల్ పేర్కొన్నాడు. భారత దేశంలో అత్యున్నతమైనది రాజ్యాంగం. మన దేశంలోని ప్రతి పౌరుడు అంటే సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ దానికి లోబడి నడుచుకోవాలి.
భారత రాజ్యాంగ పరిణామక్రమాన్ని బీసీ రావత్ 6 దశలుగా తెలిపాడు.

– క్రీ.శ. 1600 నుంచి 1772 వరకు క్రీ.శ. 1600 నుంచి 1772 వరకు

– బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేయడానికి క్రీ.శ. 1600, డిసెంబర్ 31న వ్యాపార పత్రంపై బ్రిటన్ రాణి మొదటి ఎలిజబెత్ సంతకం చేశారు.

– బెంగాల్, బొంబాయి, మద్రాసు భూభాగాలను స్వాధీనం చేసుకొని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. భారత దేశంలో మొదటిసారిగా 1687లో మద్రాస్ రాష్ట్రంలో మున్సిపాలిటీల చట్టం చేశారు.

– సూపర్‌వైజర్ పోస్టుల స్థానంలో కలెక్టర్ వ్యవస్థను 1772, మే 11న బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ వారన్ హేస్టింగ్ ఏర్పాటు చేశారు.

– ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని పరిశీలించడానికి 1772లో బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బర్గోయిన్ అధ్యక్షతన ఒక రహస్య సంఘాన్ని భారతదేశానికి పంపింది. ఈ కమిషన్ సిఫారసు మేరకు 1773లో కంపెనీ పాలనను క్రమబద్ధం చేశారు.

– క్రీ.శ. 1773 నుంచి 1857 వరకు 1773 రెగ్యులేటింగ్ చట్టం

– కంపెనీ పాలనను క్రమబద్ధ్దం చేయడానికి 1773, మే 18న లార్డ్ నార్త్ బ్రిటిష్ పార్లమెంటులో చట్టం ప్రవేశపెట్టాడు. దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. దీనిని భారతదేశంలో మొదటి లిఖిత చట్టంగా పేర్కొంటారు. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చారు. దీంతో వారన్ హేస్టింగ్‌ను బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్‌గా నియమించారు.

రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కార్యనిర్వాహక బోర్డును ఏర్పాటు చేశారు. దీంట్లో గవర్నర్ జనరల్‌తో పాటు మరో నలుగురు సభ్యులుగా ఉండేవారు. ఈ చట్టం ఆధారంగా 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియం మేయర్ కోర్టుల స్థానంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఈ న్యాయస్థానంలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులను నియమించారు. కలకత్తాలో ఏర్పాటు చేసిన ఈ సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజాయంపి.

1784 పిట్స్ ఇండియా చట్టం

రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. ఆ కాలంలో బ్రిటిష్ ప్రధానిగా ఎడ్మండ్ విలియం పిట్ ఉండటంతో ఈ చట్టానికి పిట్స్ ఇండి యా చట్టం అనే పేరొచ్చింది. ఈ చట్టం ద్వారా కంపెనీ డైరెక్టర్ల అధికారం తగ్గించడానికి బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రవేశపెట్టారు.

1. రాజకీయ వ్యవహారాలను చూడటానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆరుగురు సభ్యులు ఉండేవారు.

2. వాణిజ్య వ్యవహారాలను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌కు అప్పగించారు. ఇందులో అధ్యక్షుడితో
పాటు ముగ్గురు సభ్యులు ఉన్నారు.

1793 చార్టర్ చట్టం

ఈ చట్ట సమయంలో బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ కారన్ వాలిస్. ఆయన బెంగాల్, బీహార్‌లో శాశ్వత భూమి శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశ పెట్టాడు. సివిల్ సర్వీసుల పితామహుడు కారన్ వాలిస్.

1813 చార్టర్ చట్టం

ఈ కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా లార్డ్ మింటో – I ఉన్నారు. ఈ చట్టం ద్వారా భారతదేశంలో ప్రాథమిక విద్య అభివృద్ధికి లక్ష రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. మన దేశంలో క్రైస్తవ మిషనరీలను ఏర్పాటు చేయడానికి అనుమతించారు. విద్య, వైద్యశాలలు ఏర్పాటు చేయడానికి వాటికి అవకాశం కల్పించారు.

1833 చార్టర్ చట్టం

చార్టర్ చట్టాలన్నింటిలో ఇది ప్రధానమైనది. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారతదేశ గవర్నర్ జనరల్‌గా మార్చారు. దీంతో లార్డ్ విలియం బెంటింగ్ భారతదేశ తొలి గవర్నర్ జనరల్‌గా నియమించబడ్డాడు. ఈ చట్టాన్ని అనుసరించి దేశంలో లాకమిషన్ సభ్యున్ని నియమించారు. దీనికి మొదటి సభ్యుడు లార్డ్ మెకాలే.

1853 చార్టర్ చట్టం

ఇది చివరి చార్టర్ చట్టం. ఈ కాలంలో లార్డ్ డల్హౌసీ భారతదేశ గవర్నర్ జనరల్‌గా ఉన్నారు. 1883 చార్టర్ చట్టం ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుంచి శాసన మండలిని ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయడానికి మెకాలే చేసిన సూచనల ప్రకారం యోగ్యతా పద్ధతి (Merit system)ని ఏర్పాటు చేశారు.

మాదిరి ప్రశ్నలు

1. పాలిటిక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? (సీ)

ఏ) సోక్రటీస్ బీ) ప్లాటో
సీ) అరిస్టాటిల్ డీ) రూసో

2. ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో అతి చిన్న రాజ్యాంగం? (డీ)

ఏ) బ్రిటన్ బీ) ఆస్ట్రేలియా
సీ) కెనడా డీ) అమెరికా

3. రాజ్యం లక్షణాల్లో అతి ప్రధానమైనది ఏది? (సీ)

ఏ) ప్రభుత్వం బీ) ప్రదేశం
సీ) సార్వభౌమాధికారం డీ) ప్రజలు

4. భారతదేశంలో అత్యున్నతమైనదిగా దేనిని భావిస్తారు? ( డీ )

ఏ) న్యాయవ్యవస్థ బీ) శాసన వ్యవస్థ
సీ) పత్రికలు డీ) భారత రాజ్యాంగం

5. భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమాన్ని ఆరు దశలుగా ఎవరు పేర్కొన్నారు ? (సీ)

ఏ) అంబేద్కర్ బీ) మహాత్మా గాంధీ
సీ) బీసీ రావత్ డీ) ఆర్‌సీ ముజుందార్

6. దేశంలో మొదటి మున్సిపాలిటీని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? (డీ)

ఏ) ఆగ్రా బీ) ముంబై
సీ) కలకత్తా డీ) మద్రాస్

7. జిల్లా కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ? (బీ)

ఏ) లార్డ్ కర్జన్ బీ) వారెన్ హేస్టింగ్
సీ) కారన్ వాలిస్ డీ) లార్డ్ మింటో-II

8. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను క్రమబద్ధం చేయాలని ఎవరు సిఫారసు చేశారు? (సీ)

ఏ) సర్ థామస్ రో బీ) రాబర్ట్ ైక్లెవ్
సీ) జనరల్ బర్గోయిన్ డీ) వారన్ హేస్టింగ్

9. రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు?(సీ)

ఏ) 1757 బీ) 1764 సీ) 1773 డీ) 1772

10.బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్? (డీ)

ఏ) రాబర్డ్ ైక్లెవ్ బీ) బర్గోయిన్
సీ) విలియం బెంటింగ్ డీ) వారన్ హేస్టింగ్

11. కలకత్తాలో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? (బీ)

ఏ) 1773 బీ) 1784 సీ) 1774 డీ) 1793

12. ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం? (బీ)

ఏ) 1773 రెగ్యులేటింగ్ చట్టం
బీ) 1784 పిట్స్ ఇండియా చట్టం
సీ) 1793 చార్టర్ చట్టం డీ) పైవన్నీ

13. సివిల్ సర్వీసుల పితామహుడు? (బీ)

ఏ) వల్లభ భాయ్ పటేల్ బీ) కారన్ వాలిస్
సీ) మెకాలే డీ) డల్హౌసీ

14. భారతదేశంలో ప్రాథమిక విద్యకు లక్ష రూపాయలు కేటాయించిన చట్టం? (బీ)

ఏ) 1793 చార్టర్ చట్టం బీ) 1813 చార్టర్ చట్టం సీ) 1833 చార్టర్ చట్టం డీ) 1853 చార్టర్ చట్టం

11. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్? (బీ)

ఏ) వారన్ హేస్టింగ్ బీ) విలియం బెంటింగ్
సీ) కానింగ్ డీ) లార్డ్ మెయో


No comments:

Post a Comment