పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా మల్టీ టాస్కింగ్ పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్‌సీ క్యాలెండర్ షెడ్యుల్ ప్రకారం జూన్ 14న విడుదల చేయాల్సిన ఈ ఉద్యోగ ప్రకటనను జూన్ 30కి రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. అంటే రేపే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వనుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా ఎంటీఎస్(నాన్-టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు తేదీ, వివిధ కేటగిరీల వారీగా దరఖాస్తు ఫీజు, మొత్తం ఖాళీలు, ఎంపిక ప్రక్రియ, అర్హత ప్రమాణాలు తదితర పూర్తి సమాచారం నోటిఫికేషన్‌లో వెలువరించనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం
- కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం..
- మొత్తం 270 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. 120 మార్కులకు మొదటి సెషన్, 150 మార్కులకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్‌లో న్యూమరికల్ & మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & ప్రాబ్లం సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు. రెండో సెషన్‌లో జనరల్ అవెర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్-30శాతం, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-25శాతం, ఇతరులకు-20శాతం గా నిర్ణయించారు. మొత్తం 15 భాషల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. హవిల్దార్ పోస్టులకు ఫిజికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
దక్షిణాదిలో పరీక్ష కేంద్రాలు
- చీరాల, గుంటూరు , కాకినాడ, కర్నూలు , నెల్లూరు , రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ , విశాఖపట్నం , చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

No comments:
Post a Comment