సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, సూపరింటెండెంట్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 153 ఖాళీల వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) లో 18, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) లో, అకౌంటెంట్ లో 24, సూపరింటెండెంట్ (జనరల్) లో 11, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ లో 81, సూపరింటెండెంట్ (జనరల్) SRD -NE లో 02, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ SRD -NE లో 10, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ SRD -UT అఫ్ లఢక్ లో 02 ఉద్యోగ ఖాళీలు కలవు. అప్లికేషన్ ఆగస్టు 26 న ప్రారంభం కాగా చివరితేది సెప్టెంబర్ 24, 2023. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (28 సం//లు)కి తప్ప మిగిలిన అన్ని పోస్టులకు గరిష్ట వయసు 30 సం//లు లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. అన్ రిజర్వ్ & EWS/OBC పురుష అభ్యర్థులకు రూ. 1250/-(దరఖాస్తు రుసుము రూ. 850/- + ఇంటిమేషన్ ఛార్జీలు రూ. 400/-). SC/ ST/ మహిళలు/ PH/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 400/- (ఇంటిమేషన్ ఛార్జీలు). డెబిట్ కార్డ్‌ల ద్వారా (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, IMPS, నగదు కార్డ్‌లు/మొబైల్ వాలెట్‌లు ఉపయోగించి దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు. ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment