Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Saturday, 20 July 2024

CM Revanth Reddy: సీఎం కీలక నిర్ణయం.. నిరుద్యోగి ఖాతాల్లో రూ.లక్ష.. కావాల్సిన అర్హతలు ఇవే..

 రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నదే ప్రజా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలండర్‌ను ప్రకటించబోతున్నామని చెప్పారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నదే ప్రజా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలండర్‌ను ప్రకటించబోతున్నామని చెప్పారు.

ప్రతి ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం చెప్పారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం” కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.

సింగరేణి సంస్థ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో సివిల్స్‌లో ప్రిలిమ్స్ సాధించి మెయిన్స్‌కు ఎంపికైన యువతీ యువకులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు.  అయితే దీనికి ఎవరిని ఎంపిక చేస్తారు. దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. సింగరేణి కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ప్రారంభిస్తున్నఈ పథకం ప్రయోజనం పొందాలంటే అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ / బీసీ /ఎస్సీ /ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి.

తప్పనిసరిగా తెలంగాణ నివాసి అయి ఉండాలి. యూపీఎస్సీ నిర్వహించే ప్రలిమ్స్ పరీక్షలో పాస్ అయి ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ఉద్యోగులు అనర్హులు అని సీఎం తెలిపారు. ఇక ఈ పథకానికి ఎంపికైన వారు ఒక్కసారి ఈ ప్రోత్సాహకం లభించనుంది. రెండో సారి అర్హత ఉండదు.

ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని పేరు పెట్టి ఆర్థిక సాయం అందిస్తారు. “నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తుందని ముందు ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకం ఉండాలి.

ఈ ప్రభుత్వం కచ్చితంగా, సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి సమర్థులైన వారిని ఎంపిక చేస్తుందన్న నమ్మకం రావాలి. ఎంపికలోనూ కచ్చితంగా సామాజిక న్యాయం పాటిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, మహిళా రిజర్వేషన్లు పాటిస్తుంది. ఎలాంటి అపనమ్మకాలు అవసరం లేదన్న భావన రావాలి. సంస్థపై నమ్మకం ఉంటే నిరుద్యోగుల ఫోకస్ అంతా ప్రపిరేషన్‌పై ఉంటుంది” అని ముఖ్యమంత్రి వివరించారు.

నాడు తెలంగాణ అంటే నిరుద్యోగానికి పర్యాయపదంగా ఉండేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు 20, 22 ఏళ్ళ వయసున్న యువకులు ఉద్యోగం కోసం గత పదేళ్లలో ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆనాడు జరిగిన అనేక పొరపాట్ల వల్ల ఏ పరీక్షా సమయానికి జరక్క, పరీక్షా పత్రాలు లీకయి పల్లి బఠాణీల్లా మార్కెట్‌లో దొరకడం వంటి అనేక పరిణామాల వల్ల వారిలో నమ్మకం సన్నగిల్లడమే కాకుండా వారి జీవితంలో పదేళ్ల విలువైన కాలం వృధా అయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ నుంచి UPSC2024 లో విజయం సాధించిన అభ్యర్థులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జ్ఞాపికను అందజేసి అభినందించారు.



6 comments:

  1. Very good speech c.m.garu your every word has inspired of students

    ReplyDelete
  2. Sir, your words 100% correct,students must be embrace (hug)your words. students must be self thinking what is correct what is worng what is present my goal, that is students motto

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Ghhuyytfmkojgg

    ReplyDelete
  5. Panchayat Raj department

    ReplyDelete