Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Wednesday, 14 August 2024

రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం.. జీతం కూడా భారీ గానే..!

 ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే అభ్యర్థులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) బంపర్ ఆఫర్ ఇచ్చింది. ESIC ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ESIC అధికారిక వెబ్‌సైట్ esic.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా కర్ణాటకలోని కలబురగిలోని ESIC మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఒక సంవత్సరం పాటు (మూడేళ్ల వరకు పొడిగించవచ్చు) మొత్తం 22 స్థానాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసినవారికి ఆగస్టు 28న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ప్రొఫెసర్: 6 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్: 16 పోస్టులు.. మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారి గరిష్ట వయోపరిమితి 69 ఏళ్లు మించకూడదు. నోటిఫికేషన్ ప్రకారం, ప్రొఫెసర్లకు నెలవారీ జీతం 211,878 రూపాయలు.. అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు 140,894 రూపాయలు చెల్లించబడతాయి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ప్రాసెస్:

1. దరఖాస్తు ఫారమ్ https://www.esic.gov.in/లో అందుబాటులో ఉన్న అధికారిక నోటిఫికేషన్ లో ఉంటుంది.

2. అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందు తప్పనిసరిగా దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.

3. అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ రోజున అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్‌లను సమర్పించాలి.

4. అభ్యర్థి 28.08.2024న 09:00 AM నుండి 10:30 AM వరకు ఇంటర్వ్యూ కోసం రావాల్సి ఉంటుంది.

5. అభ్యర్థులందరూ షెడ్యూల్ చేసిన తేదీలలో వేదిక వద్ద ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం కోసం, అధికారిక ESIC వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.



No comments:

Post a Comment