ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4) ఉద్యోగాలకు (APPSC Group-4) సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 4న జిల్లా కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నట్లు తెలిపింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT) విధానంలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 24వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. మొత్తం 670 పోస్టులకు గాను స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా 2,11,341 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 11,574 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్ లో అభ్యర్థులు సాధించిన మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
No comments:
Post a Comment