తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కు సంబంధించిన పేపర్లు లీక్ కావడంతో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. ఎప్పుడు ఏ పరీక్ష ఉంటుందో తెలియని గందరగోళంగా మారింది. ఇందుకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా టీఎస్పీఎస్సీ నాలుగు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. మరో 2 పరీక్షలను వాయిదా వేసింది. గ్రూప్1 ప్రిలిమ్స్, డీఏవో, ఏఈ, ఏఈఈ, సీడీపీవో, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ పరీక్షలను నిర్వహించింది. లీకేజీ వ్యవహారంతో వీటిలో నాలుగు ఎగ్జామ్స్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు సబంధించిన కొత్త తేదీల ప్రకటనపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. మరో వారం రోజుల్లో ఈ పరీక్షల తేదీలను ప్రకటించానలి భావిస్తోంది. మే నెలలో ఆ పరీక్షలను నిర్వహించాని కమిషన్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో కుదిరినన్ని పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలోనే నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయానికి వచ్చింది. గురువారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన కమిషన్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. అధికారులు మాత్రం ఇప్పటికిప్పుడు సీబీటీ విధానంలో పరీక్షలను నిర్వహించడం సాధ్యంకాదని అధికారులు టీఎస్పీఎస్సీ బోర్డుకు తెలిపినట్లు సమాచారం. ఆగస్టు వరకు గడువు ఇస్తేనే సీబీటీ విధానంలో ఎగ్జామ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్- 2, 4 పరీక్షలకు సంబంధించిన పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించింది. వీటిని సైతం రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జులై 1న గ్రూప్-4, ఆగస్టు చివరలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తేదీలు మారే అవకాశం ఉందని సమాచారం. గ్రూప్–3 పరీక్షను సైతం ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై కమిషన్ కసరత్తు చేస్తోంది. రద్దుచేసిన, వాయిదా వేసిన, రీషెడ్యూల్ చేసే పరీక్షలకు నిర్వహించే తేదీలను సిట్ రిపోర్ట్ తర్వాతే టీఎస్పీఎస్సీ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ఏదైనా పోటీ పరీక్షకు నెల, రెండు నెలల ముందుగా ప్రశ్నపత్రాలను సిద్ధం చేస్తారు. దీంతో రద్దయిన, రీషెడ్యూల్ చేసే ఎగ్జామ్స్ కు సంబంధించిన ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణ ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.
No comments:
Post a Comment