టెట్ అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TET) ఫలితాలు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) 2023 ఫలితాలు (TS TET Results) సులభంగానే తెలుసుకోవచ్చు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాల విడుదల అయ్యాయని చెప్పుకోవచ్చు. సెప్టెంబరు 20న టెట్ ప్రాథమిక కీ విడుదల అయిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 23 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఇక సెప్టెంబరు 27న అంటే ఈ రోజున తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను కూడా విడుదల చేశారు. టెట్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in/ లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ వెబ్‌సైట్‌లోకి మీ పరీక్ష వివరాలను చెక్ చేసుకోవచ్చు. కాగా తెలంగాణ టెట్ అర్హత కాల పరిమితి జీవిత కాలం ఉంటుంది. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులు అవుతారు. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. మరో వైపు తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష జరగనుంది. జిల్లాల వారీగా ఖాళీలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 15న 2,052 కేంద్రాల్లో జరిగిన టెట్ పేపర్-1 పరీక్షకు 84.12 శాతం.. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
టెట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..
ముందుగా మీరు టీఎస్ టెట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. tstet.cgg.gov.in ఇదే అధికారిక వెబ్‌సైట్. అక్కడ టీఎస్ టెట్ 2023 రిజల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత మీ రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేయాలి. సబ్‌మిట్ చేయాలి. ఇప్పుడు మీ స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన లింక్స్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
24/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
25/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
20/09/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
26/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
25/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment