
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2023 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుష మరియు స్త్రీ అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2023 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుష మరియు స్త్రీ అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నేటి నుంచి వీటికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 7547 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం.. పరీక్ష 14 నవంబర్, 16 నవంబర్, 20 నవంబర్, 21, 22, 23, 28, 30 నవంబర్ మరియు 1 డిసెంబర్, 4 మరియు 5 డిసెంబర్ 2023 తేదీలలో జరుగుతుంది. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం.. మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు.
ఉద్యోగ ఖాళీలు 7547
- కానిస్టేబుల్ (Execute)- పురుషుడు: 4453
- కానిస్టేబుల్ (Exe.) - పురుషుడు (మాజీ సైనికులు (ఇతరులు) (బ్యాక్‌లాగ్ SC- మరియు ST-తో సహా): 266
- కానిస్టేబుల్ (Exe)-పురుషుడు (మాజీ సైనికులు [కమాండో (పారా-3.1)] (SC- and ST-తో సహా బ్యాక్‌లాగ్): 337
- కానిస్టేబుల్ (Exe)-మహిళ: 2491
ముఖ్యమైన తేదీలు
- అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
దరఖాస్తు రుసుము
- ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు.
-
విద్యార్హత
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు లోపు ఉండాలి
- దరఖాస్తు చేసుకునే ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తుల ప్రక్రియ ఇలా..
- ముందుగా అభ్యర్థులు SSC యొక్క అధికారిక సైట్‌కి ssc.nic.in వెళ్లండి.
- ఇప్పుడు అభ్యర్థి హోమ్‌పేజీలో, “ఢిల్లీ పోలీస్ పరీక్ష-2023లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుష అండ్ స్త్రీ సమాచారం”పై క్లిక్ చేయండి.
- తర్వాత అభ్యర్థి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
- దీని తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
- అప్పుడు అభ్యర్థుల దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
- ఇప్పుడు అభ్యర్థి తమ దరఖాస్తును సమర్పించవచ్చు.
- ఆ తర్వాత అభ్యర్థి తమ దరఖాస్తు ఫారమ్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- చివరగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోపడుతుంది.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment