
తెలంగాణలో (Telangana) ఉద్యోగాల కోసం ఎంతో మంది కళ్ళకు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో వరుస నోటిఫికెషన్స్ (Telangana Job Notifications) రిలీజ్ అవుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలోనే మరో గుడ్ న్యూస్ చెప్పబోతోందని సమాచారం. భారీగా అంగన్‌వాడీ (Anganwadi Jobs) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాల స్థాయి పెంచుతూ ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ ప్రభుతం నిర్ణయం తీసుకోవడంతో.. కొత్తగా 8000 ఉద్యోగాలకు అవకాశం ఏర్పడిందట. దీంతో ఈ ఉద్యోగాలను వెంటనే ఫిల్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, ఈ మేరకు అంగన్‌వాడీ ఉద్యోగాల త్వరలోనే భారీ ఎత్తున నోటిఫికేషన్ వేయబోతున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 149 ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. ఇందులో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు. మిగిలిన 3,989 కేంద్రాలు మినీ అంగన్‌వాడీ కేంద్రాలుగా గుర్తించబడ్డాయి. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల విషయానికొస్తే.. ఇందులో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉంటారు. అదే మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో కేవలం ఒక టీచర్ మాత్రమే ఉంటారు. ఈ నేపథ్యంలో వేలల్లో అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేయబోతున్నారట. రాష్ట్రంలోని శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి శాఖకు వివరాలు కూడా పంపింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్తగా హెల్పర్ల నియామకం కూడా జరగొచ్చు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ పాలసీతో దాదాపు రెండున్నర వేల మంది టీచర్లు పదవీ విరమణ చేయనున్నారట. అలాగే శిశు సంక్షేమశాఖ అప్‌గ్రేడ్ కోసం మరింత మంది స్టాఫ్ అవసరం అవుతారట. ఈ క్రమంలోనే ఒకేసారి భారీగా అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు పడుతున్నాయట. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం రానున్నట్లు టాక్.
No comments:
Post a Comment