
రాయలసీమ జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల(Sub Inspector Jobs) నియామక ప్రక్రియలో భాగంగా దేహదారుడ్య పరీక్షలలో 8,347 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.
రాయలసీమ జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల(Sub Inspector Jobs) నియామక ప్రక్రియలో భాగంగా దేహదారుడ్య పరీక్షలలో 8,347 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎస్సై మెయిన్స్ ఫైనల్ రాత పరీక్షకు(Final Exams) అర్హులైన అభ్యర్దులకు అక్టోబర్ 14 వ తేది, అక్టోబర్ 15 వ తేది లలో ఎస్ ఐ మెయిన్స్ ఫైనల్ రాత పరీక్షలు(Exams) జరగనున్నాయి.ఈ పరీక్షలకు సంబందించి కర్నూలు జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఈ పరీక్ష కేంద్రాలలో ఎస్సై మెయిన్స్ పరీక్షాలకు సంబంధించి పరీక్ష విధి విధానాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కర్నూలు జిల్లా రాయలసీమ రేంజ్ డి.ఐ.జి సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్ తో పాటు ఐడెంటిటీ కార్డు సంబంధింత సర్టిఫికెట్లు వెంట తీసుకొని రావాలని తెలిపారు అదేవిధంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు కానీ పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదని తెలిపారు.
కర్నూలు పట్టణ కేంద్రంలో
- సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల - సుంకేసుల రోడ్, - కర్నూలు .
- సిస్టర్ స్టానిస్లాస్ మెమోరియల్ ఇంగ్లీష్ స్కూల్ - సుంకేసుల రోడ్ - కర్నూలు.
- మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ – (A – క్యాంప్) , కర్నూలు,
- కె.వి.ఆర్. ప్రభుత్వ కాలేజ్ ఫర్ ఉమెన్ - రైల్వే స్టేషన్ రోడ్, కర్నూలు,
- ప్రభుత్వ జూనియర్ కళాశాల (టౌన్), కోట్ల సర్కిల్ - కర్నూలు
కర్నూలు పట్టణ శివారులోవివిధ విద్యాసంస్థలు లో 7 సెంటర్లను ఏర్పాటు చేశారు.ు
- బృందావన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ – పెద్ద టేకూరు – కర్నూలు
- అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల – దూపాడు – కర్నూలు.
- డా. కెవి సుబ్బారెడ్డి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దూపాడు – కర్నూలు.
- రాయలసీమ యూనివర్సీటి కళాశాల ఆఫ్ ఇంజనీరింగ్ – నంద్యాల రోడ్ - కర్నూలు.
- జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ - నంద్యాల రోడ్ – కర్నూలు.
- జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ – నందికొట్కూర్ రోడ్ – కర్నూలు.
- రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ – నందికోట్కూరు రోడ్ – కర్నూలు
No comments:
Post a Comment