ఈ నెల 24న హుస్నాబాద్ లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 24న హుస్నాబాద్ లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన హుస్నాబాద్ లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగపరుచుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇటీవల హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు . జాబ్ మేళా ద్వారా 5 వేల మందికి పైగా ఉపాధి కల్పించేందుకు యువజన సర్వీసుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిన యువత జాబ్ మేళాలో ప్రవేశించి సరైన సంస్థతో సరైన అవకాశాన్ని పొందవచ్చని ప్రభాకర్ అన్నారు. ఎలాంటి విద్యార్హత లేని వారు కూడా ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. యువతకు లాభసాటి ఉద్యోగాలు దొరుకుతున్న విదేశాల్లో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణను కూడా ఇస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నియోజక వర్గంలోని యువత అధిక సంఖ్యలో జాబ్ మేళాలో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.
Address
ReplyDelete9618042992
ReplyDeleteWhat kind of job
ReplyDeleteHi
ReplyDelete