తెలంగాణ నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త. జిల్లా వైద్యారోగ్య శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని జాతీయ హెల్త్ మిషన్ ద్వారా పలు పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు. కలెక్టర్ రాజర్షి షా సమక్షంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. మెరిట్, రోస్టర్ ప్రతిపాదికన పోస్టింగ్ కల్పించారు. ఇక కొత్తగా ఏర్పడిని ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దీనిలో వైద్యాధికారులు 5, ఫార్మసిస్ట్‌లు 3, స్టాఫ్ నర్స్‌లు 27, ఏఎన్‌ఏంలు 13, రేడియోగ్రాఫర్ 1, సైకియాట్రిస్ట్ 1, ఫిజియో థెరపిస్ట్ 1, వీసీసీఎం 1, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ఒకటి చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 52 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
No comments:
Post a Comment