టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC)లో
కొలువుల జాతర మళ్లీ మొదలుకానుంది. ఇటీవల మహాలక్ష్మి స్కీం తీసుకొచ్చి
మహిళలకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో
కీలక నిర్ణయం తీసుకుంది. TGSRTCలో 3035 ఉద్యోగాల భర్తీకి స్వీకారం
చుట్టింది.
టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC)లో కొలువుల జాతర మళ్లీ మొదలుకానుంది. ఇటీవల
మహాలక్ష్మి స్కీం తీసుకొచ్చి మహిళలకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..
ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. TGSRTCలో 3035
ఉద్యోగాల భర్తీకి స్వీకారం చుట్టింది.
ఈ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ఆర్టీసీ అధికారులు
ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించిన సంగతి
తెలిసిందే. అయితే తాజాగా వీటిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
త్వరలోనే ఈ నియామకాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు.
అయితే ప్రస్తుతం ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి
పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తుండగా..
కారుణ్య నియామకాలు మినహా గత పదేళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు జరగలేదు.
ప్రస్తుతం వీటి భర్తీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయనున్నారు.
కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్ తో
నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకుండా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.
హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సు సర్వీసులు నడపాలన్నాదే తమ
ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇక.. TGSRTC లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం
అనుమతి ఇవ్వగా.. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం
నుంచి అనుమతి లభించిన మొత్తం 3035 పోస్టుల్లో అత్యధికంగా డ్రైవర్ పోస్టులు
ఉన్నాయి.
వీటిలో డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ (2) 114,
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, DM/ATM/మెకానికల్/ఇంజనీర్ 40, డిపో
మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్
ఆఫీసర్ (సివిల్) 11, అకౌంట్స్ ఆఫీసర్ 06, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23,
మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, అకౌంట్స్ ఆఫీసర్ 06
ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి అర్హత ప్రమాణాలు వేరువేరుగా ఉంటాయి.
అభ్యర్థి వయస్సు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. బీసీలకు 3
సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
పోస్టును బట్టి 10వ, 12వ, ITI, డిప్లొమా, డిగ్రీ లేదా PG పూర్తి చేసిన వారు
అర్హులు. జీతం రూ. 25,500 నుండి రూ. 45,500 వరకు ఉండొచ్చు. వీటిని రాత
పరీక్ష ద్వారా నియమించనున్నారు.
అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:
SSC Constable GD
(14/10/2024 Last Date)
RRB NTPC Graduate
(13/10/2024 Last Date)
RRB NTPC Under Graduate
(20/10/2024 Last Date)
CISF Constable
(30/09/2024 Last Date)
ఎక్సమ్ డేట్స్:
SSC JE
(06-11-2024 Exam Date)
SSC MTS
(30-09-2024 to 14-11-2024 Exam Date)
SSC Stenographer
(10/12/2024 & 11/12/2024 Exam Date)
TGPSC Group II
(15-12-2024 to 16-12-2024 Exam Date)
ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:
పరీక్ష ఫలితాలు:
స్టడీ మెటీరియల్స్:
Quantitative Aptitude
Study Material
Some Important Boundary Lines
Study Material
Previous Asked Question: