Mother Tongue

Read it Mother Tongue

Thursday, 22 August 2024

గ్రూప్ 2 పరీక్షల తేదీలు వెల్లడించిన టీజీపీఎస్సీ..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2కు సంబంధించి పరీక్షల తేదీలను విడుదల చేసింది

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2కు సంబంధించి పరీక్షల తేదీలను విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు.. నాలుగు పేపర్లు అభ్యర్థులు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

2023 డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ఊహించినట్లుగానే లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2, 3వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయడం జరిగింది. ఇటీవల మరో సారి ఈ పరీక్షను వాయిదా వేశారు. తాజాగా టీజీపీఎస్సీ పరీక్షల తేదీలను వెల్లడించింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా వీటిలో 350 పోస్టులు మహిళలకే రిజర్వు చేశారు. గ్రూప్-2 మొత్తం ఖాళీల వివరాల్లోకి వెళ్తే.. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3 - 11 పోస్టులు, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్ - 59, డిప్యూటీ తహసీల్దార్‌ (నాయిబ్‌ తహసీల్దార్‌) - 98, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2 - 14 ఖాళీలు ఉన్నాయి.అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌) - 63, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్ - 09, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (మండల పంచాయతీ అధికారి)-126, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్ - 97 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు..అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌) - 38, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(జనరవ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) - 165, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ - 15 ఖాళీలు ఉన్నాయి.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials