ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు అదిరిపోయే గుడ్ న్యూస్. డోన్ నియోజకవర్గం లోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే ధ్యేయంగా డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. డోన్ నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఐటీ, ఫార్మా,సెక్యూరిటీ, ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈనెల 03-08-2024 వ తేదీన జరుగునున్న ఈ ఉద్యోగ మేళాలో హెటిరో డ్రగ్స్, శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లిప్కార్ట్,ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్,ఐసిఐసిఐ బ్యాంక్,అమర్ రాజా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, అపోలో మెడికల్ ఫార్మసీ,వంటి 15 ప్రముఖ కంపెనీలు తమ సంస్థలలోని ఖాళీగా ఉద్యోగాల భర్తీకి చేసేందుకు ఈ ఉద్యోగమేళాలో పాల్గొననున్నాయి.
ఈనెల 3వ తేదీన డోన్ నియోజకవర్గంలోని టిడిపి ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి సాయి శ్రీ డిగ్రీ కళాశాలలో జరగనుంది. ఉద్యోగమేళాలో పాల్గొనేందుకు అర్హత పదవ తరగతి నుంచి B.SC, MSC, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి పాస్ లేదా ఫెయిల్ అయినా వారు పాల్గొనవచ్చు. 03-08-2024 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీసు ఎదురుగా ఉన్న సాయిశ్రీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు.
ఈ ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు.
Im interested my Job's
ReplyDeleteBetter job
ReplyDelete