విద్యార్థులకు భారీ కానుక. ఏంటని అనుకుంటున్నారా.. ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ అందించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదిరే గుడ్ న్యూస్ అందించారు. విద్యార్థులకు భారీ కానుక అందించారు. ఆ మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.
ఇంతకీ నారా చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నారు.. దీని వల్ల ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది.. విద్యార్థలకు కలిగే లాభం ఏంటి? అసలు విషయం ఏంటి? అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న స్టైఫండ్‌ను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు 15 శాతం ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీని వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై వీరికి అధిక మొత్తం లభించనుంది.
అయితే ఈ బెనిఫిట్ కేవలం కొంత మంది విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఫస్టియర్ స్టూడెంట్స్‌కు ప్రస్తుతం రూ.70 వేలు అందిస్తూ వస్తోంది. అయితే ఇకపై ఈ మొత్తం పెరగనుంది.
రూ. 70 వేలు కాకుండా ఇకపై విద్యార్థులకు రూ.80,500 అందజేస్తారు. ఎంబీబీఎస్ హౌస్ సర్జన్స్‌కు ఇచ్చే రూ.22,527 మొత్తాన్ని కూడా పెంచేశారు. వీరికి ఇకపై రూ.25,906 లభించనున్నాయి. అలాగే పీజీ విద్యార్థులకూ స్టైఫండ్ పెరిగింది.
దీని వల్ల విద్యార్థులకు చాలా బెనిఫిట్ లభిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా అధిక మొత్తం వస్తుంది. వైద్య విద్య అభ్యసించే స్టూడెంట్స్‌కు ఇది సానుకూల అంశం అని అనుకోవచ్చు.
కాగా మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు జరగాల్సి ఉంది. తల్లిదండ్రులు ఈ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఇదే పథకం అమలు అయితే చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది.
తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఉంటే రూ.30 వేలు.. అదే ముగ్గురు అయితే రూ. 45 వేలు వస్తాయి.
No comments:
Post a Comment