వైద్య రంగంలో రాణించాలనుకునే వారికి ముఖ్యంగా మహిళలకు ఇదో గొప్ప అవకాశం. ఏఎన్ఎం నర్సింగ్ కోర్సులో ఉచితంగా శిక్షణ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ వై.జయలక్ష్మి తెలిపారు.
వైద్య రంగంలో రాణించాలనుకునే వారికి ముఖ్యంగా మహిళలకు ఇదో గొప్ప అవకాశం. ఏఎన్ఎం నర్సింగ్ కోర్సులో ఉచితంగా శిక్షణ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ వై.జయలక్ష్మి తెలిపారు.
ఇటీవల కాలంలో వైద్యరంగంలో మహిళలకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మహిళలు ముందుండాలని తెలిపారు. మానవసేవే మాధవ సేవంగం అనేది ఒక మనిషి ప్రాణాలు నిలబెట్టే రంగం ఉండేదాన్ని తెలిపారు. అంతేకాకుండా నర్సింగ్ చేసిన వారికి అటు ప్రభుత్వ పరంగాను ప్రైవేటుపరంగానూ మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. నర్సింగ్ చేసిన వారికి ఎంబీబీఎస్ చేస్తున్న వైద్య విద్యార్థులతో సమానంగా అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ పరిధిలో కూడా వీరికి సరైన అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇదులో భాగంగానే మహిళలకు ఏఎన్ఎం కోర్సుల కు సంబంధించి ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానేప్రాంతీయ శిక్షణ కేంద్రం (Female)లో నిర్వహిస్తున్న మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (Female) / ఏఎన్ఎం కోర్సుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఆసక్తి కలిగిన అభ్యర్థులు తెలుగు మీడియంలో రెండు సంవత్సరాల పాటు కోర్సు ఉచితంగా ఇస్తామన్నారు.
మహిళా అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణులు లేదా వొకేషనల్, వన్ సిట్టింగ్ ఉత్తీర్ణత పొందిన వారు కూడా అర్హులన్నారు. ఈ ఏఎన్ఎం కోడ్స్ కి సంబంధించి మొత్తం 40 సీట్లు ఉన్నాయని, ఈనెల 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపారు.దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఉచిత వసతి, ఉచిత వైద్యపరీక్షలు, ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.
మరిన్ని వివరాలకు 85559 10104, 90593 27020,99590 30873, 94908 43980 అనే నంబర్లను సంప్రదించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు అన్నారు. కావున ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మహిళ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
No comments:
Post a Comment