దేశ వ్యాప్తంగా 44,228 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన పోస్టల్ శాఖ.. తాజాగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసింది.
వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 44,228 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన పోస్టల్ శాఖ.. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీ జరుగనుంది.
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ఈ నియామకాలు జరుగుతాయి. అయితే తాజాగా వచ్చిన ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు/ మెరిట్ లిస్ట్ విడుదలైంది. ఈ ఫలితాలను indiapostgdsonline.gov.in https://indiapostgdsonline.gov.in/ and indiapostgdsonline.cept.gov.in లలో చూసుకోవచ్చు.
ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తపాలా శాఖ ఈ-మెయిల్ ద్వారా లేదా ఫోన్ నంబర్‌కు మెసేజ్ ద్వారా లేదా పోస్టు ద్వారా సమాచారం అందిస్తుంది. ఈ మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 చొప్పున పోస్టులు భర్తీ కానున్నాయి.
అయితే మొదటి సెలక్షన్ లిస్టులో ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా ఉద్యోగంలో చేరకపోతే రెండో లిస్టును రెడీ చేసి రిలీజ్ చేస్తారు. ఆపై మూడు, నాలుగో లిస్ట్ కూడా రెడీ చేసి ఉద్యోగాలకు అభ్యర్థులను తీసుకుంటారు.
ఫలితాలను డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ అనుసరించండి: Step 1: indiapostgdsonline.gov.inలో GDS రిక్రూట్‌మెంట్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. Step 2: మీ సర్కిల్‌ని ఎంచుకోండి. Step 3: మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేయండి. Step 4: మీ పేరు ఎంటర్ చేసి ఫలితాన్ని సెర్చ్ చేయండి.
ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ (Dak Sevak) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టులను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల ప్రారంభ వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment