చిత్తూరు జిల్లా మహిళా-శిశు సం క్షేమ శాఖ (ఐసీడీఎస్) పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఈ నెల 28,29,30వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ పీడీ నాగశైలజ తెలిపారు. ఆమె విలేక రులతో మాట్లాడారు. ఐసీడీఎస్ పరిధిలో జిల్లా ప్రాజెక్టు కో-ఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్స్, ప్రొటెక్షన్ ఆఫీసర్స్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెం ట్, డేటా అనలిస్ట్ పలు పోస్టులను భర్తీ చేయ నున్నట్లు తెలిపారు. ఈ నెల 23న పలు కేడర్ల పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించా మన్నారు.
ఆ పరీక్షలో ఎంపికైన, నేరుగా భర్తీ చేసే పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్య ర్థులు 28, 29, 30వ తేదీల్లో కలెక్టరేట్ నిర్వ హించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హత సర్టిఫికెట్లు, ఇతర ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని తెలిపారు. పోషణ్ అభియాన్ స్కీంలో భర్తీ చేస్తున్న జిల్లా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ పోస్టులకు ఈ నెల 28న, మిషన్ వాత్సల్య స్కీంలో భర్తీ చేస్తున్న ప్రొటెక్షన్ ఆఫీసర్స్, కౌన్సి లర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, ఔట్చ్ వర్కర్, ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 29న తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.
అలాగే మిషన్ శక్తి స్కీంలో ఐటీ, ఆఫీస్ అసిస్టెంట్, సెంటర్ అడ్మినిస్ట్రేటర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సోషల్ కౌన్సిలర్, మల్టీపర్పస్ అసిస్టెంట్, నైట్ వాచ్మన్ పోస్టులకు 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పీడీ వెల్లడించారు.
No comments:
Post a Comment