కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసిన కొన్ని రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్‌కు అప్లై చేయడానికి గడువు సమీపిస్తోంది.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు అలర్ట్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసిన కొన్ని రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్‌కు అప్లై చేయడానికి గడువు సమీపిస్తోంది. ఈ వారం అప్లై చేయాల్సిన ఉద్యోగాలు ఏవో పరిశీలించండి.
* ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) గ్రూప్ ‘సి’ సివిలియన్ పోస్టింగ్స్ కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. అభ్యర్థులు IAF అధికారిక వెబ్‌సైట్ indianairforce.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ సెప్టెంబర్ 1. మొత్తం 182 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో 157 ఎల్‌డిసిలకు, 18 హిందీ టైపిస్టులకు రిజర్వ్ చేశారు. డ్రైవర్ పోస్టులు ఏడు ఉన్నాయి. పోస్టుల విభాగం ఆధారంగా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. LDC ఉద్యోగాలకు 12వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. అన్ని ఉద్యోగాలకు 18 నుంచి 25 ఏళ్ల వయోపరిమితి ఉంటుంది. SC, ST, శారీరక వికలాంగులు, OBC వర్గాల అభ్యర్థులకు వయసు మినహాయింపు ఉంటుంది.
IBPS PO రిక్రూట్‌మెంట్
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) ఉద్యోగాలకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.inలో ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ఆగస్టు 21 వరకు గడువు ఉంది. డిగ్రీ పాస్ అయ్యి, వయసు 20-30 ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 4,455 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్, OBC కేటగిరీల అభ్యర్థులు రూ. 850; SC, ST, PwBD వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.175 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
RRC రిక్రూట్‌మెంట్
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఆఫ్ వెస్ట్రన్ సెంట్రల్ రైల్వేస్ విభాగం (RRC WCR), అప్రెంటీస్‌షిప్ పోస్టుల కోసం అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ wcr.indianrailways.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సెప్టెంబర్ 4 వరకు గడువు ఉంది. మొత్తం 3,317 అప్రెంటిస్‌షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. JBP విభాగంలో అత్యధికంగా 1,262 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో 50 శాతం మార్కులు సాధించినవారు.. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఏదో ఒక సబ్జెక్టులు చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT అందించిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి.
HPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్
హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (HPSC), హర్యానాలోని ఉన్నత విద్యా విభాగంలో వివిధ సబ్జెక్టులలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాలేజీ కేడర్) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభించింది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ athpsc.gov.inలో ఆగస్టు 27 వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 2,424 పోస్టులను సంస్థ భర్తీ చేయనుంది.
RSMSSB CET రిక్రూట్‌మెంట్
రాజస్థాన్ సబార్డినేట్ అండ్ మినిస్టీరియల్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (RSMSSB), కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CET) 2024 కోసం అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ atrsmssb.rajasthan.gov.inలో సెప్టెంబర్ 8లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్‌కు సెప్టెంబర్ 21 నుండి 24 వరకు, సీనియర్ సెకండరీ అభ్యర్థులకు అక్టోబర్ 23 నుండి 26 వరకు సెట్ నిర్వహిస్తారు.
No comments:
Post a Comment