దరఖాస్తుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఈ నెల 3నుంచి 10వ తేదీ లోపు కలెక్టరేట్లోని మహిళా-శిశు సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.
చిత్తూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని ఆ శాఖ పీడీ నాగశైలజ కోరారు. ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కో-ఆర్డినేటర్ (జనరల్), జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్(జనరల్), బంగారు పాళ్యం బ్లాక్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ (ఎస్సీ), పలమనేరు - బ్లాక్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ (ఓసీ), బైరెడ్డిపల్లె బ్లాక్ - ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ (బీసీ-ఏ), శాంతిపురం బ్లాక్ - ప్రాజెక్ట్ కో- ఆర్డినేటర్(ఓసీ), కుప్పం బ్లాక్ ప్రాజెక్ట్ కో-ఆ - ర్డినేటర్ (ఎస్టీ), వుంగనూరు బ్లాక్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్( ఐఓసీ) పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
అలాగే జిల్లా బాలల పరిరక్షణ విభాగం లో ప్రొటెక్షన్ ఆఫీసర్ 1,కౌన్సిలర్ 1, సోషల్ వర్కర్ 1, అకౌంటెంట్ 1, డేటా అన లిస్ట్ 1, ఔట్రచ్ వర్కర్ 1. ఆయాలు 2, పార్ట్ టైం డాక్టర్ 1, వన్ స్టెప్ సఖి కేంద్రంలో ఖాళీగా ఉన్న సెంటర్ అడ్మిని స్ట్రేటర్ 1, పారాలీగల్ పర్సనల్ 1, పారామెడికల్ పర్సనల్ 1, సోషల్ కౌన్సెలర్ 1, ఆఫీస్ అసిస్టెంట్ 1, మల్టీ పర్పస్ స్టాఫ్ 2, సెక్యూరిటీ గార్డులు 2 పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
సఖీ కేంద్రంలో పోస్టులకుఅర్హులైన మహిళలు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను www.chittoor. ap.gov.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చన్నారు. దరఖాస్తుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఈ నెల 3 నుంచి 10వ తేదీ లోపు కలెక్టరేట్లోని మహిళా-శిశు సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు. పది నుంచి డిగ్రీ వరకు చదివిన వారు అర్హులు. కేటగిరి ఆధారంగా జీతభత్యాలు ఉంటాయి.
Yes
ReplyDeleteKurnool
ReplyDelete