Mother Tongue

Read it Mother Tongue

Saturday, 3 August 2024

నిరుద్యోగులకు వండర్‌ఫుల్ ఆఫర్.. పరీక్ష లేకుండానే జాబ్..

 ప్రస్తుతం బయట నిరుద్యోగ సమస్య ఉందని తెలుసు… అందుకే నిరుద్యోగులు ఈ అవకాశం మాత్రం మీరు వదులుకోవద్దు.

గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. 2024 మే నెలలో 6.3 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు… జూన్ నాటికి 9.3 శాతానికి పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గ్రామీణప్రాంతాల్లో నిరుద్యోగంలో కురుకుపోయిన పురుషుల సంఖ్య మేలో 5.4 శాతంగా ఉండంగా జూన్ నాటికి 8.2 శాతానికి చేరిందని చెబుతున్నారు.అదే కాలంలో మహిళల సంఖ్య 12.0 శాతం 17. 1 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతంలో ఈ నిరుద్యోగ సమస్య కాస్త తక్కువగానే నమోదు అయింది. మే నెలలో 8.6 శాతంగా ఉన్నా రేటు జున్ లొ 8.9 శాతానికి పెరిగింది. కార్మిక భాగస్వామ్య రేటు( lpr ) స్వల్పంగా మెరుగుపడింది. 2024 మే నెలలో 40.8 శాతం ఉండగా జూన్ నాటికి 41.4 శాతానికి పెరిగిందన్నారు.గత ఏడాది జూన్లో 39.9 శాతంగా ఉంది.
ఈ కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లోఏ జాబ్ వచ్చిన చేయడానికి యువత సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారన్నారు నిపుణులు.పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా సమర్ధులకు ఉపాధి లభించకపోవడంతో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు.ప్రపంచం చాలా ఏళ్లుగా నిరుద్యోగ సంక్షోభం ఎదుర్కొంటుందన్నారు.గత రెండు మూడేళ్లుగా జరిగిన పరిస్థితులు ఆధారంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వేగంగా పుంజుకోలేకపోతోందన్నారు.
చాలా దేశాల్లో సరైన ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి కరువు అవ్వటంతో దొరికిన పనులు చేస్తూ జీవితాలు నెట్టుకొస్తున్నారు పలువురు యువకులు.టెక్నాలజీ మార్పుతో మిషన్లు వచ్చేయటంతో చేతివృత్తులకు దాదాపు ఎండ్ కార్డు పడిపోయిందన్నారు.అందువల్ల చాలామందికి ఉపాధి దొరకడం చాలా కష్టతరమైపోయిందన్నారు.పారిశ్రామిక దేశాలు దశాబ్దాల తరబడి దీన్ని ఒక సమస్యగానే గుర్తించలేదన్నారు.క్రమంగా నిరుద్యోగం తీవ్ర రూపం దాలుస్తోందన్నారు.కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోందన్నారు.
మరి ఇంత నిరుద్యోగ సమస్య ఉందని తెలిసి… ఈ అవకాశం మాత్రం మీరు వదులుకోవద్దు. కేవలం మీరు పీజీ చదివి ఉంటే చాలు ఈ ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఆధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎస్.సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో మ్యాథమెటిక్స్, జువాలజీ, బోటని,ఇంగ్లీష్,ఆధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ )లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు అన్నారు. ఈ నెల ఏడవ తేదీలోగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు మూడు సెట్లు జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన కోరారు. మరేందుకు ఆలస్యం మీకు అర్హత ఉంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఉద్యోగంలో స్థిరపడండి.


No comments:

Post a Comment

Job Alerts and Study Materials