Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 6 August 2024

Post Office: 44,228 ప్రభుత్వ ఉద్యోగాలు.. మరో రెండు రోజులే ఈ సదవకాశం

 దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీ జరగనుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన కీలక అప్ డేట్ ఇచ్చారు.

వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుంది. దేశ వ్యాప్తంగా 44,228 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన పోస్టల్ శాఖ.. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీ జరుగనుంది. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ఈ నియామకాలు జరుగుతాయి.

ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ (Dak Sevak) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టులను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల ప్రారంభ వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది.

ఇప్పటికే ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారందరికీ తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అప్లికేషన్స్ సమర్పించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indiapostadsonline.gov.in ద్వారా అవసరమైన వివరాలను సరిచేయవచ్చు. ఎడిట్ విండో ఆగస్టు 8, 2024 వరకు అందుబాటులో ఉండనుంది.

ఇండియా పోస్ట్ GDS 2024 అప్లికేషన్ ఎడిట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

Step 1: ముందుగా indiapostgdsonlineలో ఇండియా పోస్ట్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Step 2: హోమ్‌పేజీలో ఎడిట్ విండోపై క్లిక్ చేయండి.

Step 3: మీరు సవరించాలనుకునే లైన్ ఎంచుకోండి.

Step 4: అవసరమైన రుసుములను చెల్లించండి.

Step 5: తదుపరి ఉపయోగం కోసం రసీదు ఫారమ్ కాపీని సమర్పించి, సేవ్ చేయండి.



8 comments:

Job Alerts and Study Materials