నిరుద్యోగ అభ్యర్థులందరు ఉచిత డీఎస్సీ కోచింగ్ కు అర్హులన్నారు.అభ్యరుల వయస్సు, ఇతర అర్హతలు విద్యాశాఖ వారి నిబంధన మేరకు కలిగి ఉండాలన్నారు.
చిత్తూరు జిల్లాలోని బీఈడి, డీఈడీ కోర్సులు పూర్తి చేసి టెట్ నందు ఉత్తీర్ణత పొందిన గిరిజననిరుద్యోగ యువతీ యువకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తర్వుల మేరకు అర్హతలు కలిగిన వారికి తిరుపతి పట్టణములో ఉచిత భోజనం, వసతితో కూడిన డీఎస్సీ కోచింగ్ ఇవ్వబడుతుందని జిల్లా గిరిజన సంక్షేమం మరియు సాధికారత అధికారి మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
ఉచిత DSC కోచింగ్ చేసేందుకుఅర్హతలు: బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన, టెట్ నందు ఉతీర్ణత కలిగిన ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులందరు ఉచిత డీఎస్సీ కోచింగ్ కు అర్హులన్నారు.అభ్యరుల వయస్సు, ఇతర అర్హతలు విద్యాశాఖ వారి నిబంధన మేరకు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు డిగ్రీ, బి ఇ డి / ఇంటర్ + డి ఇ డి మరియు టెట్ యందు ఉత్తీర్ణత పొందిన మార్కుల ప్రకారం తయారు చేయబడిన మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారన్నారు (లేదా) ఏదైనా స్క్రీనింగ్ పరీక్ష ప్రకారం ఎంపిక చేస్తారన్నారు.
మహిళలకు 33 1/3 శాతము రిజర్వేషను కలదు. కావున బీఈడీ/ డీఈడీమరియు టెట్ కోర్సులలో ఉత్తీర్ణత చెందిన నిరుద్యోగ గిరిజన యువతీ యువకులు వారి పూర్తి బయోడేటాతో పాటు వారి విద్యార్హత, కులదృవీకరణ పత్రము, రేషను కార్డు , ఆధారు కార్డు పాసుపోర్డు సైజు కలర్ ఫోటోతో పాటు ఆయా కోర్సుల్లోఉత్తీర్ణత సాధించిన ధృవీకరణ పత్రము మరియు ఇతర సంబంధిత ధృవీకరణ పత్రము నకలులను గెజిటేట్ అధికారి వారిచే ధృవీకరించి (Attestation) సదరు అభ్యర్థుల బయోడేటాకు జతపరచాలన్నారు. వాటినిజిల్లా గిరిజన సంక్షేము మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయము, అంబేద్కర్ భవనము, కలెక్టరేట్ ప్రాంగణము, రెడ్డిగుంట, చితూరు నందు ఈ నెల 12వ తేది (సోమవారం) సా.5 గం. ల లోపు సమర్పించాలన్నారు, ఇతర వివరముల కొరకు 08572-241056 నందు సంప్రదించగలరని జిల్లా గిరిజన సంక్షేము మరియు సాధికారిత అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment