Mother Tongue

Read it Mother Tongue

Friday, 2 August 2024

Job Vacancies: సొంతూరులోనే ఉద్యోగాలు.. 7 చదివినా చాలు, వెంటనే అప్లై చేసుకోండి!

 ఆసక్తి, అర్హత గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు చేసుకున్న మహిళలు మండల పరిధి గ్రామాలకు చెందిన వారై ఉండాలన్నారు. 7 నుంచి పదో తరగతి వరకు చదువుకొని ఉంటే చాలు.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) దేశంలోని బలహీన వర్గాల కోసం భారత ప్రభుత్వంచే నిర్వహించబడే రెసిడెన్షియల్ బాలికల మాధ్యమిక పాఠశాల. ఈ పథకాన్ని 2004లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు,మైనారిటీ వర్గాలు, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చెందిన బాలికలకు విద్యా సౌకర్యాలు అందించడానికి సర్వ శిక్షా అభియాన్ కార్యక్రమంలో ఇది విలీనం చేయబడింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది బాలికలు ఈ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఎంఈఓ సత్యనారాయణ మరియు నోడల్ ఆఫీసర్ లింగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాలయంలో నైట్ వాచ్ ఉమెన్,స్వీపర్ కం స్కావెంజర్,హెడ్ కుక్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.

దరఖాస్తులు చేసుకునే మహిళలు పర్వతగిరి మండలానికి చెందిన వారై ఉండాలి.18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. నైట్ వాచ్ ఉమెన్ పోస్ట్ కు పదో తరగతి పాసై సెక్యూరిటీ ఏజెన్సీలో అనుభవం కలిగి ఉండాలని, హెడ్ కుక్ పోస్టుకు పదో తరగతి పాసై ఉండాలని తెలిపారు. స్వీపర్ కం స్కావెంజర్ పోస్టుకు 7వ తరగతి పాసై ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత పత్రాలతో ఆగస్టు 4 తేదీల్లోగా సంబంధిత పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ నజియా సల్మాను 7680946704 నెంబర్ లో సంప్రదించాలన్నారు.

అదేవిధంగా దుగ్గొండి మండలం మల్లంపల్లిలోని కస్తూర్బా విద్యాలయంలో ఖాళీగా ఉన్నా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్య శాఖ అధికారి తెలిపారు. డే వాచ్ ఉమెన్, స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి, అర్హత గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు చేసుకున్న మహిళలు మండల పరిధి గ్రామాలకు చెందిన వారై ఉండాలన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్కావెంజర్ కు 7వ తరగతి చదివి ఉండాలన్నారు మహిళలు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలని ఆసక్తి కలిగిన వారు కస్తూర్బా విద్యాలయంలో ఆగస్టు 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials