మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఉమ్మడి కర్నూలు జిల్లా DSC అభ్యర్థులకు అలర్ట్. జిల్లాలోని షెడ్యూల్డు తెగలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు డీఎస్సీ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు ఆయా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా గిరిజన సాంఘీకసంక్షేమాధికారిణి జే.రంగలక్ష్మిదేవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. గత 10 సంవత్సరాల నుండి ఎలాంటి DSC నోటిఫికెషన్స్ లేక అల్లాడిపోతున్న నిరుద్యోగ DSC అభ్యర్థులకు గొప్ప శుభవార్త తెలిపింది.
మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ షురూ చేసి డిసెంబర్ 10లోగా పరీక్షలు పూర్తి చేయాలని ప్రణాళిక ఏర్పాటు చేసారు. ముందుగా TET పరీక్ష నిర్వహించిన,ప్రభుత్వం ఆ తర్వాత మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారట. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం చేసి శిక్షణ సైతం ప్రారంభించింది.
ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో వంద మంది గిరిజన అభ్యర్థులకు DSC ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమాధికారిణి జే.రంగలక్ష్మిదేవి తెలిపారు.సొసైటీల చట్టం/ ట్రస్ట్/ ప్రొప్రైటరీ ఫర్మ్ కింద నమోదై ఐదేళ్ల నుంచి డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ఫలితాలు సాధించిన శిక్షణా సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులను ఆయా సంస్థలకు కేటాయిస్తామని తెలిపారు.
శిక్షణా సంస్థలు తమ బోధనా సిబ్బంది వివరాలు, గత ఐదేళ్ల ఫలి తాలు, ఫీజు వివరాలతో సెప్టెంబర్ 3వ తేదీలోగా కర్నూలు పట్టణం లోని బిర్లా గేట్ సమీపంలో ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం పనివేళల్లో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కార్యాలయం లేదా 94910 23041 అనే నంబర్లో సంప్రదించాలని తెలిపారు. ఇటీవల వెలువడిన నోటిఫికేషన్ లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 2678 టీచర్ పోస్టులు ఉన్నాయని కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment