నిరుద్యోగులకు ఇదొక శుభవార్త. ప్రైవేట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ జాబ్ మేళాలో పాల్గొంటే చాలు.. జాబ్ మీసొంతం కావచ్చు . పూర్తి వివరాలలోకి తెలుసుకోండి.
నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 14న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో అన్నపూర్ణ పైనాన్స్ ప్రైవేట్ లిమిటేడ్, పసిఫిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని సుమారు 440 మందికి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారన్నారు.
నిరుద్యోగులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నిజామాబాద్‌లోని శివాజీనగర్ లో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో, జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. అయితే నిరుద్యోగులు ఉదయం 10:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా ఉపాది కార్యాలయంలో హజరుకావాల్సి ఉంటుందని తెలిపారు.
ఉద్యోగ మేళాకు Annapurna Finance Private Limited , PACIFIC IT CONSULTING PVT LTD కంపెనీలలో FCO (ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్) , DO (డెవలప్మెంట్ ఆఫీసర్ ) , ASM (అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ) , Surface Mount Technology, Final Assembly and Testing ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతారన్నారు.
జాబ్ మేళాలో పాల్గొనే వారి అర్హతలు చూస్తే ఇంటర్మీడియేట్, బీఈ, బీటెక్ డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసైనవారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వారు నిజామాబాద్ జిల్లా పరిధిలో 40 మంది, హైదరాబాద్ పరిధిలో 400 మంది అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుందని ఉపాధి అధికారి తెలిపారు.
అర్హత కలిగిన వారిని ఆయా కంపెనీల ప్రతినిధులు ఎంపిక చేసుకుంటారన్నారు. నిరుద్యోగులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి బి. పి మధుసూదన్ రావు తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
అభ్యర్థులు తమ Resume, బయో డేటా, ఆధార్ కార్డు, SSC మెమో , ఫోటో తీసుకురావాలన్నారు. మీ అర్హతకు, చదువుకు తగిన ఉద్యోగం పొందవచ్చని, మరింత సమాచారం కోసం 9581768413, 9948748428, 6305743423, 9959456793 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
No comments:
Post a Comment