ఐటీఐ చేసి మంచి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అద్భుత అవకాశం. భారత నౌకాదళంలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. నావల్ షిప్ రిపేర్ యార్డ్ (NSRY), నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ (NAY) కొచ్చి అప్రెంటిస్‌షిప్స్ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్ ఇతర విభాగాల్లో మొత్తం 240 పోస్టులను భర్తీ చేయనుంది.
ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 19వ తేదీలోగా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఎంపికైన అభ్యర్థి భారత నౌకాదళంలో పని చేస్తారు.
* ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి?
వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్ పొజిషన్‌లు అందుబాటులో ఉన్నాయి. లిస్టులోని కంప్యూటర్ ఆపరేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికల్), మెకానిక్ రిఫ్రిజిరేటర్ & ఏసీ, టర్నర్, వెల్డర్ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, షీట్ మెటల్ వర్కర్, సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రోప్లేటర్ అప్రెంటిస్‌లుగా జాయిన్ అవ్వచ్చు. అలానే ప్లంబర్, డీజిల్ మెకానిక్, షిప్ రైట్ (వుడ్), పెయింటర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్ (గ్రైండర్), మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్ & మెకానికల్) విభాగాల్లోనూ ఖాళీలు ఉన్నాయి.
* అర్హత ప్రమాణాలు ఏంటి?
విద్యార్హతలు: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ITI సర్టిఫికేషన్: దరఖాస్తుదారులు సంబంధిత ట్రేడ్‌లో కనీసం 65% మార్కులతో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తుదారులకు గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు. అయితే, రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఉంది. SC/ST కేటగిరీలకు చెందిన వారికి 5 సంవత్సరాలు సడలింపు ఇస్తారు. అలానే OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
* ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం లేదు. అప్లికేషన్ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను https://www.indiannavy.nic.in/ ఓపెన్ చేయండి. హోమ్‌పేజీలో ‘NSRY & NAY అప్రెంటిస్‌షిప్ వేకెన్సీ’ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.బేసిక్ డీటైల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్డ్ ఐడీ, పాస్‌వర్డ్‌తో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోండి.
* అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి?
అవసరమైన అన్ని వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూరించండి. అప్లికేషన్‌కి మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, అటెస్ట్ చేసిన ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, పాన్ కార్డ్, ఐటీఐ మార్క్‌షీట్, ఆధార్ కార్డ్ కాపీలు అటాచ్ చేయాలి. అప్లికేషన్‌ని నావల్ షిప్ రిపేర్ యార్డ్, నావల్ బేస్, కొచ్చి-682004 అడ్రస్‌కి పంపాలి. అప్లికేషన ఫామ్‌ని సమర్పించడానికి సెప్టెంబర్ 19 చివరి తేదీ అని గుర్తుంచుకోవాలి.
* సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులు నేవీ అధికారుల నుంచి శిక్షణ పొందుతారు. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత, భారత నౌకాదళంలో ఉద్యోగ అవకాశాలు ఉండవచ్చు.
No comments:
Post a Comment