హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిమ్స్ లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 101 పోస్టుల భర్తీకి సిద్ధమయ్యారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.nims.edu.in/ వెబ్‌సైట్ విజిట్ చేయండి.
అప్లై చేసిన వారిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.32 వేల జీతం ఉంటుంది. ఈ పోస్టులకు గాను ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగా.. ఆగస్టు 24 చివరి తేదీగా ప్రకటించారు.
రేడియాలజీ, బయో మెడికల్, పాథాలజీ, థెరపిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్, మైక్రోబయాలజీ, అనస్తీషియా, బ్లడ్ బ్యాంక్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 36 ఏళ్లుగా పేర్కొన్నారు.
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే జనరల్ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు ఉండదు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలోనే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా: ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2వ అంతస్తు, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్, పంజాగుట్ట. ఆ తర్వాత రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేస్తారు.
No comments:
Post a Comment