ఈ ఉద్యోగమేళాకు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నిరుద్యోగులైన యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారి పి. దీప్తి తెలిపారు.
పదవ తరగతి పూర్తయి ఐ.టి.ఐ లో ఫిట్టరు, ప్లంబరు, వెల్డరు, డ్రాఫ్ట్ మెన్, సివిల్, లేదా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 20నమినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా ఉపాధి కార్యాలయం, కర్నూలు వారి ఆధ్వర్యంలో 20.08.2024న మంగళవారం ఉదయం 10.00 గంటలకు కర్నూలు పట్టణంలోని సి-క్యాంప్ లో ఉన్న జిల్లా ఉపాధికల్పనా కార్యాలయంలోఈ మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారితెలిపారు.ఈ మినీ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీ అయినటువంటి భారత్ ఫైనాన్సియల్ ఇంక్లూషన్, నవభారత్ ఫర్టిలైజర్స్,ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి కంపినిలు తమ సంస్థలో కాలిగా ఉన్న పోస్టులు భర్తీచేసేందుకు ఈ మినీ జాబ్ మేళాలోపాల్గొంటునాయని తెలిపారు.
ఎంపికైన వారికి 16 వేల జీతంతో పాటు 2నెలల పాటు ఉచిత శిక్షణ కూడా అందిస్తారని తెలిపారు. ఈ ఉద్యోగమేళాకు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపిన ఆమె ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.www.ncs.gov.in నందు రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment